Team india : టీమ్ఇండియా కొత్త జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్.. ఒక్కొ మ్యాచ్‌కు ఎంతంటే..?
టీమ్ఇండియా (Team india) కొత్త జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్ ఎంపికైంది. 2027 వరకు ఒప్పందం కొనసాగనుంది. ఈ కాల వ్యవధిలో భారత జట్టు..

Apollo tyres be the indian team new jersey sponsor
Team india : టీమ్ఇండియాకు కొత్త జెర్సీ స్పాన్సర్ వచ్చేసింది. అపోలో టైర్స్ భారత క్రికెట్ జట్టుకు కొత్త జెర్సీ స్పాన్సర్ హక్కులను దక్కించుకుంది. 2027 వరకు అపోలో టైర్స్ భారత జట్టుకు జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది.
ఇంతకముందు ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ ‘డ్రీమ్ 11’ టీమ్ఇండియా జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరించింది. అయితే.. ఇటీవల ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడంతో తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. 2023లో డ్రీమ్ ఎలెవన్ మూడేళ్ల కాలానికి రూ.358 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఒక్కొ మ్యాచ్‌కు రూ.4.5 కోట్లు..
ఒప్పంద కాలవ్యవధిలో టీమ్ఇండియా(Team india) 130 మ్యాచ్‌లను ఆడనుంది. ఈ మ్యాచ్‌లు అన్నింటికి కూడా అపోలో టైర్స్ జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈ క్రమంలో ఒక్కొ మ్యాచ్‌కు బీసీసీఐకు అపోలో టైర్స్ రూ.4.5 కోట్లు చెల్లించనుంది. గతంలో ఉన్న డ్రీమ్ 11 సంస్థ ఒక్కొ మ్యాచ్‌కు రూ.4 కోట్లు ఇచ్చేది.
జెర్సీ స్పాన్సర్ లేకుండా ఆసియాకప్‌లో భారత్..
డ్రీమ్ 11 వైదొలగడంతో ప్రస్తుతం భారత జట్టు జెర్సీ స్పాన్సర్ లేకుండానే ఆసియాకప్ 2025లో ఆడుతోంది. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ నుంచి అపోలో టైర్స్ జెర్సీ స్పాన్సర్‌గా ఉండనుంది.