Womens Ashes Series : చెలరేగిన అష్లే గార్డెనర్.. యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియాదే
ప్రతిష్టాత్మక మహిళల యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా జట్టు సొంతం చేసుకుంది. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో అతిథ్య ఇంగ్లాండ్ పై 89 పరుగుల తేడాతో ఆసీస్ గెలుపొందింది.

Australia win Ashes Series
Australia win Ashes Series : ప్రతిష్టాత్మక మహిళల యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా జట్టు సొంతం చేసుకుంది. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో అతిథ్య ఇంగ్లాండ్ పై 89 పరుగుల తేడాతో ఆసీస్ గెలుపొందింది. 268 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 178 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లీష్ బ్యాటర్లలో డానియల్ వ్యాట్(54; 88 బంతుల్లో 5 ఫోర్లు) అర్ధశతకంతో రాణించగా మిగిలిన వారు దారుణంగా విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. ఆసీస్ బౌలర్లలో అష్లే గార్డెనర్ 8 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించగా కిమ్ గార్త్, తహిలా మెక్‌గ్రాత్ చెరో వికెట్ పడగొట్టారు.
అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 124.2 ఓవర్లలో 473 పరుగులకు ఆలౌటైంది. అన్నాబెల్ సదర్లాండ్ (137; 184 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్) సెంచరీ చేయగా ఎల్లీస్ పెర్రీ (99; 153 బంతుల్లో 15 ఫోర్లు) తృటిలో శతకాన్ని చేజార్చుకుంది. మిగిలిన వారిలో తహ్లియా మెక్‌గ్రాత్ (61; 83 బంతుల్లో 8 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకుంది. ఇంగ్లాండ్ బౌలర్లలో సోఫీ ఎక్లీస్టోన్ ఐదు వికెట్లు పడగొట్టగా, లారెన్ బెల్, లారెన్ ఫిలర్ చెరో రెండు వికెట్లు తీశారు.
టామీ బ్యూమాంట్ (208; 331 బంతుల్లో 27 ఫోర్లు) డబుల్ సెంచరీ చేయడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 121.2 ఓవర్లలో 463 పరుగులు చేసింది. నాట్ సివర్ బ్రంట్(78), హీథర్ నైట్(57) అర్ధశతకాలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో అష్లీ గార్డ్‌నర్ నాలుగు వికెట్లు పడగొట్టగా, తహిళా మెక్‌గ్రాత్ మూడు వికెట్లు తీసింది. దీంతో ఆసీస్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో 10 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
World Cup Qualifier : దంచికొట్టిన జింబాబ్వే బ్యాటర్లు.. వన్డేల్లో అత్యధిక స్కోరు
అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా బెత్ మూనీ(85), అలీసా హీలీ(50) హాఫ్ సెంచరీలతో రాణించడంతో రెండో ఇన్నింగ్స్‌లో 257 పరుగులకు ఆలౌటైంది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 12 వికెట్లు తీసిన అష్లే గార్డెనర్ మ్యాన్ ఆఫ్ ద్య మ్యాచ్‌ను అందుకుంది.