Asia Cup 2022 : సెంచరీతో కదంతొక్కిన కోహ్లి.. అప్ఘానిస్తాన్‌కు బిగ్ టార్గెట్

ఆసియా కప్ టీ20 టోర్నీ సూపర్ -4లో అఫ్ఘానిస్తాన్ తో నామమాత్రపు మ్యాచ్ లో భారత్ చెలరేగింది. విరాట్ కోహ్లి సెంచరీతో కదంతొక్కడంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది.

Asia Cup 2022 : సెంచరీతో కదంతొక్కిన కోహ్లి.. అప్ఘానిస్తాన్‌కు బిగ్ టార్గెట్

Updated On : September 8, 2022 / 9:16 PM IST

Asia Cup 2022 : ఆసియా కప్ టీ20 టోర్నీ సూపర్ -4లో అఫ్ఘానిస్తాన్ తో నామమాత్రపు మ్యాచ్ లో భారత్ చెలరేగింది. విరాట్ కోహ్లి సెంచరీతో కదంతొక్కడంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి భారత్ 212 పరుగులు చేసింది. అప్ఘాన్ ముందు 213 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.

ఈ మ్యాచ్ లో కెప్టెన్ గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. కేఎల్ రాహుల్ 41 బంతుల్లో 62 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లి 61 బంతుల్లో 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి స్కోర్ లో 12 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. అప్ఘాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు.

ఆసియా కప్‌ 2022లో భారత్‌కు ఇది చివరి మ్యాచ్‌. సూపర్‌ -4లో వరుసగా రెండు ఓటములతో టీమిండియా తన ఫైనల్‌ అవకాశాలు చేజార్చుకుంది. మరోవైపు అఫ్గాన్‌ పరిస్థితి కూడా భారత్‌ మాదిరిగానే ఉంది. ఈ మ్యాచ్‌ ఫలితంతో ఇరు జట్లకూ ప్రయోజనం శూన్యం. అయితే టోర్నమెంట్‌ను విజయంతో ముగించాలని భావిస్తున్నాయి. టాస్‌ నెగ్గిన అఫ్ఘానిస్తాన్ కెప్టెన్‌ నబీ బౌలింగ్‌ ఎంచుకున్నాడు.

బుధవారం జరిగిన మ్యాచ్‌లో పాక్‌ను ఓటమి అంచుల వరకు తీసుకెళ్లిన అఫ్ఘాన్ ను తక్కువగా అంచనా వేస్తే మాత్రం భారత్‌కు మరో పరాభవం తప్పదని అనలిస్టులు అంటున్నారు. టీ20ల్లో అత్యుత్తమంగా రాణించే ఆటగాళ్లు అఫ్ఘాన్‌ సొంతం. ఈ మ్యాచ్‌కు రోహిత్‌ శర్మకు బదులు కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్ గా వ్యవహరించాడు.