Asia Cup 2023 : పాకిస్తాన్‌పై శ్రీలంక సంచలన విజయం.. చివరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీ, ఫైనల్లో భారత్‌తో ఢీ

ఈ ఓటమితో పాకిస్తాన్ ఇంటిబాట పట్టింది. శ్రీలంక ఫైనల్ కు చేరుకుంది. ఆదివారం ఫైనల్ మ్యాచ్ లో భారత్ తో శ్రీలంక తలపడనుంది. Sri Lanka Vs Pakistan

Asia Cup 2023 : పాకిస్తాన్‌పై శ్రీలంక సంచలన విజయం.. చివరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీ, ఫైనల్లో భారత్‌తో ఢీ

Asia Cup 2023 (Photo : Google)

Updated On : September 15, 2023 / 1:56 AM IST

Sri Lanka Vs Pakistan : ఆసియా కప్ సూపర్ 4 లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన కీలక మ్యాచ్ లో శ్రీలంక అదరగొట్టింది. నరాలు తెగేంత ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై సంచలన విజయం సాధించింది. చివరి బంతికి లక్ష్యాన్ని చేధించి థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. డక్ వర్త్ లూయిస్ విధానంలో 2 వికెట్ల తేడాతో లంక గెలుపొందింది.

వర్షం కారణంగా 42 ఓవర్లకు మ్యాచ్ ని కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 7 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. శ్రీలంక.. చివరి బంతికి టార్గెట్ ఫినిష్ చేసింది. కుశాల్ మెండిస్ సూపర్ బ్యాటింగ్ చేశాడు. 87 బంతుల్లోనే 91 పరుగులు చేసి జట్టు గెలుపులో కీరోల్ ప్లే చేశాడు.. సదీరా (48), చరిత్ అసలంక(49) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

Also Read..MS Dhoni: సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఇదే రోజు టీమిండియాకు కెప్టెన్‌గా ఒక్కడొచ్చాడు.. భారత్‌కు ఈ విజయాలన్నీ అందించి..

ఈ ఓటమితో పాకిస్తాన్ ఇంటిబాట పట్టింది. శ్రీలంక ఫైనల్ కు చేరుకుంది. ఆదివారం ఫైనల్ మ్యాచ్ లో భారత్ తో శ్రీలంక తలపడనుంది.