Asian Champions Trophy 2023 : భారత్‌లో అడుగుపెట్టిన పాకిస్తాన్ జట్టు.. ఆగస్టు 9న దాయాదుల సమరం
ఆగస్టు 3 నుంచి ప్రారంభం కానున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో పాల్గొనేందుకు పాకిస్తాన్ హాకీ జట్టు భారత్‌కు చేరుకుంది. పంజాబ్‌లోని అత్తారీ– వాఘా సరిహద్దు ద్వారా పాక్ జట్టు భారత్‌లోకి అడుగుపెట్టింది.

Pakistan hockey team arrives India
Asian Champions Trophy : ఆగస్టు 3 నుంచి ప్రారంభం కానున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో పాల్గొనేందుకు పాకిస్తాన్ హాకీ జట్టు భారత్‌కు చేరుకుంది. పంజాబ్‌లోని అత్తారీ– వాఘా సరిహద్దు ద్వారా పాక్ జట్టు భారత్‌లోకి అడుగుపెట్టింది. పాక్ బృందానికి భారత అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ హాకీ జట్టు కోచ్ ముహమ్మద్ సక్లైన్ మాట్లాడుతూ.. ‘ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు చెన్నైకి వెలుతున్నాము. ఆసియా నలుమూలల నుంచి ఈ టోర్నీలో పాల్గొనేందుకు జట్లు వస్తుంటాయి. అన్ని దేశాలతో క్రీడల ద్వారా, మా బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని ఆశిస్తున్నాం.’ అని అన్నాడు
పాకిస్థాన్ హాకీ జట్టు కెప్టెన్ మహ్మద్ ఉమర్ భుట్టా మాట్లాడుతూ.. ఆగస్టు 3 నుంచి 12 వరకు జరగనున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు వచ్చాము. క్రీడల ద్వారా ఇతరులతో మీ సంబంధాలను పెంచుకోవచ్చు. జట్టుగా విజయం సాధించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపాడు.
చెన్నైలోని మేయర్ రాధాకృష్ట స్టేడియంలో ఆగస్టు 3 నుంచి 12 వరకు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ జరగనుంది. ఇక అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్, పాక్ జట్ల మధ్య హాకీ మ్యాచ్ ఆగస్టు 9న జరుగనుంది.
2011 నుంచి ఆసియా హాకీ ఫెడరేషన్(Asian Hockey Federation) ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. భారత్, పాకిస్తాన్ జట్లకు ఈ టోర్నీలో మంచి రికార్డు ఉంది. భారత జట్టు ఆరంభ సీజన్ 2011లో చాంపియన్‌గా నిలిచింది. ఆ తరువాత 2016లోనూ విజేతగా నిలిచింది. 2018లో మాత్రం పాకిస్తాన్‌తో ట్రోఫీని పంచుకుంది. పాకిస్తాన్ 2012, 2013లో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇక 2021లో దక్షిణ కొరియా జట్టు గెలిచింది.
Virat Kohli : కోహ్లి ఏ ఇయర్ బడ్స్ వాడుతాడో తెలుసా..? మన దగ్గర దొరకవు.. ధర ఎంతంటే..?
Punjab: Pakistan Hockey Team players arrive at Attari-Wagah Border, Amritsar ahead of Asian Championships Trophy in Chennai.#HACT2023#asiahockeyfedration pic.twitter.com/85wjSEu9Ng
— Asian Hockey Federation (@asia_hockey) August 1, 2023