IND vs WI : భార‌త జ‌ట్టుకు కొడుకుతో క‌లిసి వెల్‌క‌మ్ చెప్పిన మాజీ సీఎస్‌కే ఆల్‌రౌండ‌ర్‌.. గుర్తు ప‌ట్టారా..?

వెస్టిండీస్‌తో కీల‌కమైన మూడో వ‌న్డే ఆడేందుకు భార‌త జ‌ట్టు సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో సోమ‌వారం టీమ్ఇండియా ఆట‌గాళ్లు ట్రినిడాడ్ చేరుకున్నారు. భార‌త ఆట‌గాళ్ల‌కు వెస్టిండీస్ మాజీ స్టార్ ఆల్‌రౌండ‌ర్ త‌న కుమారుడితో క‌లిసి స్వాగ‌తం ప‌లికాడు.

IND vs WI : భార‌త జ‌ట్టుకు కొడుకుతో క‌లిసి వెల్‌క‌మ్ చెప్పిన మాజీ సీఎస్‌కే ఆల్‌రౌండ‌ర్‌.. గుర్తు ప‌ట్టారా..?

Dwayne Bravo welcomed Teamindia players

Updated On : August 1, 2023 / 6:44 PM IST

India vs West Indies : వెస్టిండీస్‌తో కీల‌కమైన మూడో వ‌న్డే ఆడేందుకు భార‌త జ‌ట్టు సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో సోమ‌వారం టీమ్ఇండియా ఆట‌గాళ్లు ట్రినిడాడ్ చేరుకున్నారు. భార‌త ఆట‌గాళ్ల‌కు వెస్టిండీస్ మాజీ స్టార్ ఆల్‌రౌండ‌ర్ డ్వేన్ బ్రావో (Dwayne Bravo) త‌న కుమారుడితో క‌లిసి స్వాగ‌తం ప‌లికాడు. ఇందుకు సంబంధించిన వీడియోను భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో పాటు ఆట‌గాళ్లు అంద‌రూ బ్రావోతో మాట్లాడారు. ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌రుపున బ్రావో ఆడిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు ఆట‌గాళ్లు అయిన రుతురాజ్ గైక్వాడ్‌, ర‌వీంద్ర జ‌డేజాల‌తో బ్రావోకు ఎక్కువ అనుబంధం ఉంటుంది అన్న సంగ‌తి తెలిసిందే. బ్రావో కొడుకుతో రుతురాజ్ ముచ్చట్లు పెట్టాడు. ఆఖ‌ర‌ల్లో కెప్టె రోహిత్ శ‌ర్మ కూడా బ్రావోను ప‌ల‌కరించ‌డంతో పాటు అత‌డి కుమారుడికి షేక్ హ్యాండ్ ఇచ్చి అత‌డితో మాట్లాడ‌డం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Virat Kohli : కోహ్లి ఏ ఇయ‌ర్ బ‌డ్స్ వాడుతాడో తెలుసా..? మ‌న ద‌గ్గ‌ర దొర‌క‌వు.. ధ‌ర ఎంతంటే..?

ఇదిలా ఉంటే.. నిర్ణ‌యాత్మ‌క‌మైన మూడో వ‌న్డేలో వెస్టిండీస్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు భార‌త జ‌ట్టు సిద్ధ‌మైంది. మూడు వ‌న్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజ‌యం సాధించిన భార‌త్‌ రెండో మ్యాచులో అన‌వ‌స‌రంగా అతి ప్ర‌యోగాల‌కు పోయి చేతులు కాల్చుకుంది. ఫ‌లితంగా ఇరు జ‌ట్లు సిరీస్‌లో 1-1తో నిలిచాయి. దీంతో నేడు(ఆగ‌స్టు 1) బ్రియాన్ లారా స్టేడియంలో జ‌రిగే మ్యాచ్ కీల‌కంగా మారింది. ఈ మ్యాచ్‌లో పూర్తి స్థాయి జ‌ట్టుతో టీమ్ఇండియా బ‌రిలోకి దిగుతుందా..? లేదంటే.. మ‌ళ్లీ ప్ర‌యోగాలు చేస్తుందా అన్న‌ది చూడాల్సిందే.

LPL 2023 : లంక ప్రీమియ‌ర్ లీగ్‌లో అనుకోని అతిథి.. బంగ్లాదేశ్ నుంచి వ‌చ్చింద‌న్న దినేశ్ కార్తీక్

డ్వేన్ బ్రావో వెస్టిండీస్ త‌రుపున 40 టెస్టుల్లో 2,200 ప‌రుగులు చేయ‌డంతో పాటు 86 వికెట్లు 164 వ‌న్డేల్లో 2,968 ప‌రుగులు చేయ‌డంతో పాటు 199 వికెట్లు, 91 టీ20 1,255 ప‌రుగుల‌తో పాటు 78వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్‌లో 161 మ్యాచులు ఆడాడు. 1,560 ప‌రుగులు చేయ‌డంతో పాటు 183 వికెట్లు తీశాడు. ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో చెన్నై జ‌ట్టు బౌలింగ్ కోచ్‌గా సేవ‌లు అందిస్తున్నాడు.