Asian Games 2023: ఆసియా క్రీడల్లో ఎన్నడూలేనన్ని పతకాలు గెలుచుకున్న భారత్.. అంతేకాదు..
చరిత్రలో భారత్ తొలిసారి 20 స్వర్ణ పతకాలను సొంతం చేసుకోవడం కూడా ఇదే మొట్టమొదటిసారి.

Asian Games 2023
Asian Games 2023: ఏషియన్ గేమ్స్-2023లో భారత్ అదరగొడుతోంది. మొట్టమొదటిసారి భారత్ పతకాల సంఖ్య 100 దాటింది. ఇప్పటికే మొత్తం 95 పతకాలను కైవసం చేసుకున్న భారత్.. శుక్రవారం మరో ఏడు పతకాలను ఖరారు చేసుకుంది. ఆర్చరీలో 3, కబడ్డీలో 2, బ్యాడ్మింటన్, మెన్స్ క్రికెట్లో ఒక్కో పతకాన్ని ఖరారు చేసుకుంది భారత్.
దీంతో దీంతో భారత్ పతకాల సంఖ్య ఇప్పటికే 102కు చేరిందని చెప్పవచ్చు. అంతేకాదు, చరిత్రలో భారత్ తొలిసారి 20 స్వర్ణ పతకాలను సొంతం చేసుకోవడం కూడా ఇదే మొట్టమొదటిసారి. శుక్రవారం నాటికి భారత్ ఖాతాలో 22 స్వర్ణ, 34 వెండి, 39 రజత పతకాలు ఉన్నాయి.
ఏషియన్ గేమ్స్-2023లో భారత మెన్స్, విమెన్స్ క్రికెట్ జట్లు ఆడడం ఇదే తొలిసారి. శనివారం ఫైనల్లో అఫ్గానిస్థాన్ తో భారత మెన్స్ టీమ్ తలపడనుంది. ఇప్పటికే మన జట్టుకు వెండి పతకం ఖరారైంది. ఏషియన్ గేమ్స్-2023 పాయింట్ల పట్టికను చూస్తే చైనా మొత్తం 353 పతకాలతో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత వరుసగా జపాన్(165), దక్షిణ కొరియా(169), భారత్ (95+7) ఉన్నాయి.
Asian Games 2023: చెలరేగిన తిలక్ వర్మ.. భారత్ చేతిలో బంగ్లాదేశ్ చిత్తు.. ఫైనల్లో టీమిండియా