AUS vs ENG : ఆఖరి టెస్టులో ముగిసిన నాలుగో రోజు ఆట.. బెథెల్ సెంచరీ.. 119 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న (AUS vs ENG) ఐదో టెస్టు మ్యాచ్‌లో నాలుగో రోజు ఆటముగిసింది.
AUS vs ENG 5th test Day 4 Stumps England lead by 119 runs
AUS vs ENG : యాషెస్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 75 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. జాకెబ్ బెథెల్ (142; 232 బంతుల్లో 15 ఫోర్లు), మాథ్యూ పాట్స్ (0) లు క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 119 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరో రోజు ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలవాలంటే ఆఖరి రోజు అద్భుతం జరగాల్సిందే.
అంతక ముందు 518/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసీస్ 567 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు కీలమైన 183 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ (138; 220 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించగా వెబ్‌స్టర్ (71; 87 బంతుల్లో 7 ఫోర్లు) రాణించాడు. ఇంగ్లీష్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, జోష్ టంగ్ చెరో మూడు వికెట్లు తీశారు. బెన్‌స్టోక్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. విల్ జాక్స్, జాకబ్ బెథెల్ తలా ఓ వికెట్ పడగొట్టాడు.
ఆ తరువాత 183 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్ కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. జాక్ క్రాలీని మిచెల్ స్టార్క్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేర్చడంతో 4 పరుగుల వద్దే ఇంగ్లాండ్ తొలి వికెట్ ను కోల్పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన జాకెబ్ బెథల్‌తో కలిసి బెన్ డకెట్ (42) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. రెండో వికెట్ కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
We lead by 119 runs heading into the fifth and final day of the 2025/26 Ashes series. pic.twitter.com/FWMpRFrXft
— England Cricket (@englandcricket) January 7, 2026
బెన్ డకెట్ పెవిలియన్‌కు చేరుకున్న తరువాత వచ్చిన రూట్ (6) విఫలమైన.. హ్యారీ బ్రూక్ (42)తో కలిసి బెథెల్ నాలుగో వికెట్ కు 102 పరుగులు జత చేశాడు. హ్యారీ బ్రూక్ ఔటైన తరువాత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. జాకబ్ బెథెల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు.
Rohit Sharma : రోహిత్ భయ్యా.. వడాపావ్ కావాలా..? హిట్‌మ్యాన్ ఆన్సర్ అదుర్స్..
ఆఖరి రోజు అతడు ఎంత మేరకు నిలుస్తాడు? ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని ఎంత వరకు తీసుకువెలుతాడు అనే దానిపైనే ఇంగ్లాండ్ ఆశలు ఆధారపడి ఉంటాయి. ఆసీస్ బౌలర్లలో వెబ్‌స్టర్ మూడు వికెట్లు తీశాడు. స్కాట్ బొలాండ్ రెండు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్, మిచెల్ నీసర్ లు తలా ఓ వికెట్ తీసుకున్నారు.
