IND vs AUS : ఆసీస్‌తో రెండో టెస్టుకు ముందు టీమ్ఇండియా మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం.. ఇక పై..
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు కీలక నిర్ణయం తీసుకుంది.

AUS vs IND No more fans at practice after India objects to open net sessions
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పై ప్రాక్టీస్ సెషన్స్ సమయంలో ఫ్యాన్స్ కు అనుమతి నిరాకరించింది. అడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి జరగనున్న రెండో టెస్టు మ్యాచ్ కోసం మంగళవారం టీమ్ఇండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. అయితే.. ఆ సమయంలో ఆటగాళ్ల ప్రాక్టీస్‌ను చూసేందుకు వందల సంఖ్యలో ఫ్యాన్స్ స్టేడియానికి వచ్చారు.
ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. అయితే.. ఈ సమయంలో కొందరు ఫ్యాన్స్ టీమ్ఇండియా ఆటగాళ్లను ఎగతాళి చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా బాడీ షేమింగ్‌కు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని భారత జట్టు మేనేజ్‌మెంట్ చాలా సీరియస్‌గా పరిగణించింది. ఇక పై ఈ టూర్‌లో టీమ్ఇండియా ఆటగాళ్లు ప్రాకీస్ట్ సెషన్స్ కు ఫ్యాన్స్ ను అనుమతించకూడదు అని ఆసీస్ క్రికెట్ బోర్డుకు తెలియజేసింది.
‘ఇది పూర్తిగా గందరగోళంగా ఉంది. ఆస్ట్రేలియా ప్లేయర్ల ప్రాక్టీస్ సమయంలో 70 మంది కంటే కూడా తక్కువ మందే ఉన్నారు. అయితే.. భారత ఆటగాళ్లు సాధన చేస్తున్న సమయంలో దాదాపు 3 వేల మందికి పైగా వచ్చారు. ఇంత మంది ఫ్యాన్స్ వస్తారని అసలు ఊహించలేదు.’ అని ఓ బీసీసీఐ అధికారి పీటీఐకి చెప్పారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమ్ఇండియా శుభారంభం చేసింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో గెలిచి ఐదు మ్యాచుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. అడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌లోనూ గెలిచి ఆధిక్యాన్ని పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. డే అంట్ నైట్ మ్యాచ్‌గా జరగనున్న ఈ పింక్ బాల్ టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని ఆస్ట్రేలియా పట్టుదలగా ఉంది.
Big Cricket League : బిగ్ క్రికెట్ లీగ్ తొలి సీజన్ షెడ్యూల్ వచ్చేసింది.. డిసెంబర్ 12 నుంచి..
🚨 TEAM INDIA BANS OPEN PRACTICE SESSION…!!! 🚨
– Approx 5,000 fans tuned in for India’s net session yesterday with some of them passing demeaning comments, so the BCCI have decided to go ahead with closed doors practice sessions for the rest of the Australian tour. (The Age). pic.twitter.com/QY3hTGZBjM
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 4, 2024