కీలక పోరు: భారత్ బ్యాటింగ్.. ఆస్ట్రేలియా ఫీల్డింగ్

తొలి మ్యాచ్‌లో ఓటమితో బాగా స్ట్రగుల్ అవుతున్న టీమిండియా సెకండ్ వన్టేలో ఆస్ట్రేలియాతో ఆమీతుమి తేల్చుకునేందుకు సిద్ధం అయ్యింది. రెండో వన్డేలో ఓడిపోతే మ్యాచ్‌నే కాదు… సిరీస్‌ని కోల్పోతాం. కాబట్టి జట్టు తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి.
ఈ పోరులో సరిచేస్తేనే ఆఖరి పోరు రసవత్తరంగా ఉంటుంది. రాజ్ కోట్ లో జరుగుతున్న వన్డేలో ఎలాగైనా గెలవాలి అని కోహ్లీ సేన ఓవైపు.. గెలిచి సిరీస్ పట్టుకుపోవాలని ఆస్ట్రేలియా మరోవైపు పోరుకు సిద్ధం అయ్యింది.
పూర్తి స్థాయి బలాలతో రెండు జట్లు బరిలోకి దిగుతుండటంతో ఈ వన్డే సిరీస్ హోరాహోరీగా జరగుతుంది. సొంతగడ్డపై బలహీన దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంకలతో వరుసగా గెలిచిన ఇండియా ఫస్ట్ వన్టేలోనే షాక్ ఇచ్చింది ఆస్ట్రేలియా. 2019 మార్చిలో భారత్‌లోనే జరిగిన వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు టీమిండియా గెలవగా.. చివరి మూడు గెలిచిన ఆసీస్ సిరీస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సిరీస్ ఇంట్రస్టింగ్‌గా ఉంది.
ఈ క్రమంలోనే భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండవ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుని భారత్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. మొదటి వన్డే వాంఖడేలో జరగగా మూడో వన్డే 19న బెంగుళూరులో జరుగనుంది.
జట్ల వివరాలు:
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాహుల్(కీపర్), అయ్యర్, మనీష్ పాండే , జడేజా, షైనీ, కుల్దీప్, బుమ్రా, షమీ.
ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), వార్నర్, స్మిత్, లబ్‌షేన్, క్యారీ, అగర్, జంపా, స్టార్క్, కమిన్స్, ఆష్టన్ టర్నర్, కేన్ రిచర్డ్‌సన్