T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్‌కు ఆస్ట్రేలియా జట్టు ఇదే.. అరివీర భయంకరులంతా వచ్చేశారు.. గాయపడిన వారికీ చాన్స్.. కానీ..

T20 World Cup 2026 Australia Squad : భారత్, శ్రీలంక దేశాల్లోని వేదికలపై ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది.

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్‌కు ఆస్ట్రేలియా జట్టు ఇదే.. అరివీర భయంకరులంతా వచ్చేశారు.. గాయపడిన వారికీ చాన్స్.. కానీ..

T20 World Cup 2026 Australia Squad

Updated On : January 1, 2026 / 11:14 AM IST
  • టీ20 వరల్డ్‌కప్ కోసం జట్టును ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా
  • పేస్, స్పిన్ ఆల్‌రౌండర్లతో ఆసీస్ జట్టు
  • గాయాలతో ఇబ్బంది పడుతున్న ప్లేయర్లకు చోటు
  • జనవరి 31 వరకు మార్పులకు అవకాశం

T20 World Cup 2026 Australia Squad : టీ20 వరల్డ్ కప్‌ మెగా టోర్నీకి సమయం దగ్గరపడుతుంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు భారత్, శ్రీలంక వేదికగా టీ20 వరరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టును ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. అయితే, తాజాగా.. క్రికెట్ ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ కోసం తమ జట్టును ప్రకటించింది.

Also Read : Team India : 2026లో రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు ఎన్ని వ‌న్డేల్లో ఆడే అవ‌కాశం ఉందో తెలుసా?

టీ20 వరల్డ్ కప్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా మిచెల్ మార్ష్ సారథ్యంలో 15మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జట్టు సభ్యుల వివరాలతో పోస్టు చేసింది. సెలక్టర్ల చైర్మన్ జార్జ్ బెయిలీ మాట్లాడుతూ.. కమిన్స్, హేజిల్ వుడ్, డేవిడ్ లు కోలుకుంటున్నారని.. ఈ ముగ్గురూ టోర్నమెంట్ సమయానికి ఫిట్ గా ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశాడు.

గాయాలతో ఇబ్బంది పడుతున్న కమిన్స్, డేవిడ్ గ్రేడ్, హేజిల్‌వుడ్ వంటి ప్లేయర్లకు కూడా టీ20 జట్టులో అవకాశం దక్కింది. ఆడిలైడ్‌లో జరిగిన యాషెస్ టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో టెస్టులో మాత్రమే కమిన్స్ ఆడాడు. అతడు వెన్నెముక గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఈనెల చివర్లో స్కాన్ నిర్వహించనున్నారు. ఆ స్కాన్ ఆధారంగా అతను తుది జట్టులో చేరనున్నాడు. మరోవైపు.. బిగ్‌బాష్ లీగ్ మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ తొడ కండరాల (హ్యామ్‌స్ట్రింగ్) గాయానికి గురయ్యాడు. హేజిల్‌వుడ్ హోమ్‌స్ట్రీంగ్ గాయం తరువాత చీలమండల నొప్పితో యాషెస్ సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే, వీరంతా టీ20 వరల్డ్ కప్ మెగాటోర్నీ సమయానికి కోలుకుంటారని.. అందుకే వారిని జట్టులో ఎంపిక చేయడం జరిగిందని జార్జ్ బెయిలీ తెలిపాడు.

credit@crickt australia

credit@crickt australia

ఆస్ట్రేలియా జట్టును చూస్తుంటే.. ఉపఖండ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, స్పిన్ బౌలింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తూ సెలెక్టర్లు జట్టును రూపొందించినట్లు కనిపిస్తోంది. నెమ్మదైన పిచ్‌లు, టర్న్‌కు అనుకూలమైన పరిస్థితుల్లో రాణించేలా సమతూకంతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఇటీవలే టీ20ల్లోకి అడుగుపెట్టిన కూపర్ కొన్నోలీకి జట్టులో చోటు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇది ప్రాథమిక స్వ్కాడ్ మాత్రమేనని, అవసరమైతే జనవరి 31వరకు మార్పులకు అవకాశం ఉందని సెలక్షన్ కమిటీ చైర్మన్ జార్జ్ బెయిలీ చెప్పడాన్నిబట్టి చూస్తుంటే.. గాయాలతో ఇబ్బందులు పడుతున్న ముగ్గురు ప్లేయర్లు ఈ నెల చివరి నాటికి ఫిట్‌నెస్ సాధించకపోతే పక్కనపెట్టే అవకాశం ఉంది.

ఆస్ట్రేలియా జట్టు ఇదే..
మిచెల్‌ మార్ష్‌ (కెప్టెన్‌), జేవియర్‌ బార్ట్‌లెట్‌, కూపర్ కొన్నోలీ, పాట్‌ కమ్మిన్స్‌, టిమ్‌ డేవిడ్‌, కామెరూన్‌ గ్రీన్, నాథన్‌ ఎల్లిస్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, ట్రావిస్‌ హెడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌, మ్యాథ్యూ కుహ్నెమన్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, మ్యాథ్యూ షార్ట్‌, మార్కస్‌ స్టోయినిస్‌, ఆడమ్‌ జంపా.