AUS vs IND : హమ్మయ్య.. టీమిండియాకు తప్పిన ఫాలో ఆన్ గండం.. నాల్గోరోజు ఆట పూర్తి

బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు డ్రా దిశగా పయనిస్తుంది. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ..

AUS vs IND : హమ్మయ్య.. టీమిండియాకు తప్పిన ఫాలో ఆన్ గండం.. నాల్గోరోజు ఆట పూర్తి

Teamindia

Updated On : December 17, 2024 / 2:28 PM IST

AUS vs IND : బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు డ్రా దిశగా పయనిస్తుంది. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేయగా.. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఈ క్రమంలో కేఎల్ రాహుల్, (84), జడేజా (77) పరుగులతో భారత్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. అయితే, చివరిలో టెయిలెండర్లు జస్ర్పీత్ బుమ్రా(10 నాటౌట్), ఆకాశ్ దీప్ (27నాటౌట్) పదో వికెట్ కు 39 పరుగులు జోడించి భారత్ ను ఫాలో ఆన్ గండం నుంచి బయటపడేశారు. దీంతో టీమిండియా శిబిరంలో జోష్ వచ్చింది. నాల్గోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. ఆసీస్ కంటే టీమిండియా ఇంకా 193 పరుగుల వెనుకంజలో ఉంది.

Also Read: IND vs AUS: బ్రిస్బేన్ టెస్టులో జడేజా సరికొత్త రికార్డు.. భారత్ నుంచి తొలి ప్లేయర్ అతనే

నాల్గోరోజు ఆటలో వర్షం కారణంగా మ్యాచ్ పలుసార్లు వాయిదా పడింది. ఆట ప్రారంభంలో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ క్రీజులోకి వచ్చారు. కొద్దిసేపటికే రోహిత్ శర్మ (10) ఔట్ అయ్యాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి కేఎల్ రాహుల్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. కేఎల్ రాహుల్ ఔట్ కావటంతో క్రీజులోకి వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి (16) పరుగులకే ఔట్ అయ్యాడు. మహ్మద్ సిరాజ్ (1) ఔట్ కాగా.. రవీంద్ర జడేజా (77) పరుగుల వద్ద పెవిలియన్ బాటపట్టాడు. జస్ర్పీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ 39 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో పాటు టీమిండియాను పాల్ ఆన్ గండం నుంచి బయటపడేశారు. ఆస్ట్రేలియా బౌలర్లు పాట్ కమిన్స్ నాలుగు, మిచెట్ స్టార్క్ మూడు, జోష్ హేజిల్ వుడ్, నాథన్ లైయన్ చెరో వికెట్ తీశారు.

Also Read: Rohit Sharma: ఆస్ట్రేలియాతో సిరీస్ తరువాత టెస్ట్ ఫార్మాట్‌కు రోహిత్ శర్మ గుడ్ బై.. నిజమెంత?

టీమిండియా 252 పరుగుల వద్ద వెలుగురు లేమి కారణంగా ఆటను అంపైర్లు నిలిపివేశారు. ఆ తరువాత కొద్దిసేపటికే నాలుగో రోజు ఆట ముగిసినట్లు ప్రకటించారు. ఐదోరోజు ఆటలో టీమిండియా ఆలౌట్ అయితే.. ఆ తరువాత ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. మొత్తానికి టీమిండియా ఓటమి నుంచి తప్పించుకున్నట్లేనని చెప్పొచ్చు. ఏదైనా అద్భుతం జరిగితేతప్ప.. మూడో టెస్టు డ్రా అయ్యే అవకాశాలు ఉన్నాయి.