ప్రపంచకప్ ఫైనల్: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఇండియా ఫీల్డింగ్

  • Published By: vamsi ,Published On : March 8, 2020 / 06:49 AM IST
ప్రపంచకప్ ఫైనల్: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఇండియా ఫీల్డింగ్

Updated On : March 8, 2020 / 6:49 AM IST

మహిళల టీ20 ప్రపంచకప్‌-2020 ఫైనల్‌ పోరు ప్రారంభం అయ్యింది. ఫైనల్ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా మహిళల జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 2020 టీ20 ప్రపంచకప్‌‌లో ఈసారీ అంచనాలకు మించిన ఆటతో అజేయంగా నిలిచి తొలిసారి తుదిపోరుకు చేరుకుంది భారత మహిళల జట్టు. 

టాస్ ఓడిపోయినా కూడా ఆస్ట్రేలియా ప్లేయర్లను తమ బౌలర్లు కట్టడి చేస్తారని.. లక్ష్య ఛేదనలోనూ సత్తా చాటుతామని భారత అమ్మాయిల సారథి హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ వెల్లడించింది. మిగతా మ్యాచ్‌ల మాదిరిగానే ఫైనల్‌ మ్యాచ్‌ను సవాల్‌గా తీసుకొని సమష్టిగా రాణిస్తామని కౌర్‌ చెప్పుకొచ్చింది.

సరిగ్గా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున జరిగే ఈ మ్యాచ్‌లో మన అమ్మాయిలు సగర్వంగా త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించాలని యావత్ భారతం కోరుతుంది. మహిళల క్రికెట్లో అత్యంత విధ్వంసకర బ్యాట్స్ ఉమెన్‌గా నిలిచిన షెఫాలీ వర్మపై అందరి దృష్టి ఉంది. టోర్నీలో ఓటమే లేకుండా ఫైనల్‌ చేరిన భారత్‌ ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతోంది.