ICC Test Rankings : చ‌రిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఆట‌గాళ్లు.. దిగ‌జారిన కోహ్లి, రోహిత్ ర్యాంక్స్‌

అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌(ICC) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌ను ప్ర‌క‌టించింది. బ్యాటింగ్ విభాగంలో భార‌త్ నుంచి ఒక్క ఆట‌గాడు మాత్ర‌మే టాప్‌-10లో స్థానం ద‌క్కించుకోగా ఆస్ట్రేలియా బ్యాట‌ర్లు తొలి మూడు స్థానాల్లో నిలిచారు.

ICC Test Rankings : చ‌రిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఆట‌గాళ్లు.. దిగ‌జారిన కోహ్లి, రోహిత్ ర్యాంక్స్‌

ICC Test Rankings

Test Rankings: అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌(ICC) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌ను ప్ర‌క‌టించింది. బ్యాటింగ్ విభాగంలో భార‌త్ నుంచి ఒక్క ఆట‌గాడు మాత్ర‌మే టాప్‌-10లో స్థానం ద‌క్కించుకోగా ఆస్ట్రేలియా బ్యాట‌ర్లు తొలి మూడు స్థానాల్లో నిలిచారు. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్‌లో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌తో స్టార్ ఆట‌గాళ్లైన విరాట్ కోహ్లి(Virat Kohli), రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) ర్యాంకులు ప‌డిపోయాయి. భార‌త్ నుంచి రిష‌బ్ పంత్(Rishabh Pant) మాత్ర‌మే 758 రేటింగ్ పాయింట్ల‌తో ప‌దో స్థానంలో కొన‌సాగుతున్నాడు.

రోహిత్ 12, విరాట్ కోహ్లి 13వ స్థానాల‌కు ప‌డిపోయారు. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌లో అద‌ర‌గొట్టిన అజింక్యా ర‌హానే 37వ స్థానానికి చేరుకున్నాడు. అర్ధ‌శ‌త‌కంతో రాణించిన శార్దూల్ ఠాకూర్ కూడా 94వ స్థానానికి ఎగబాకాడు. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌లో అద్భుతంగా రాణించిన ట్రావిస్ హెడ్‌, స్టీవ్ స్మిత్‌లు టాప్‌-3లో నిలిచారు.

Rishabh Pant : పంత్‌ను చూశారా.. ఎవ‌రి సాయం లేకుండానే మెట్లు ఎక్కేస్తున్నాడు.. వీడియో వైర‌ల్‌

ఆస్ట్రేలియాకే చెందిన మార్న‌స్ లబుషేన్ త‌న అగ్ర‌స్థానాన్ని నిల‌బెట్టుకోగా స్మిత్, హెడ్‌లు వ‌రుస‌గా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. కాగా.. ఇలా ఒకే జ‌ట్టుకు చెందిన ఆట‌గాళ్లు టాప్‌-3లో నిలవ‌డం 39 ఏళ్ల త‌రువాత ఇదే తొలిసారి. గ‌తంలో 1984లో వెస్టిండీస్ ఆట‌గాళ్లు గ్రీనిడ్జ్, క్లైవ్ లాయిడ్‌. లారీ గోమ్స్ లు తొలి మూడు స్థానాల్లో నిలిచారు.

డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ ఆడ‌న‌ప్ప‌టికి బౌలర్ల జాబితాలో ర‌విచంద్ర‌న్ అశ్విన్ 860 పాయింట్ల‌తో తన అగ్ర‌స్థానాన్ని నిల‌బెట్టుకున్నాడు. ఆ త‌రువాత వ‌రుస‌గా జేమ్స్‌ అండర్సన్ (850), పాట్ కమిన్స్‌ (829) లు ఉన్నారు. భార‌త్‌కు చెందిన బుమ్రా(772) రెండు స్థానాల‌ను కోల్పోయి 8వ స్థానానికి ప‌డిపోగా ర‌వీంద్ర జ‌డేజా(765) తొమ్మిదోలోనే కొన‌సాగుతున్నాడు.

MS Dhoni : వ‌చ్చే సీజ‌న్ ధోని ఆడ‌డా..? సీఎస్‌కే పోస్ట్ చేసిన వీడియోకి అర్థం అదేనా..?