IND vs BAN : భార‌త్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టు.. మైదానంలో బంగ్లాదేశ్ వీరాభిమాని టైగ‌ర్ రాబి పై దాడి! ఆస్ప‌త్రిలో..

బంగ్లాదేశ్ వీరాభిమాని టైగ‌ర్ రాబి పై దాడి జ‌రిగింది.

IND vs BAN : భార‌త్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టు.. మైదానంలో బంగ్లాదేశ్ వీరాభిమాని టైగ‌ర్ రాబి పై దాడి! ఆస్ప‌త్రిలో..

Bangladesh Super Fan Allegedly Beaten Up During Kanpur Test

Updated On : September 27, 2024 / 5:43 PM IST

కాన్పూర్ వేదిక‌గా భార‌త్‌, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్టు మ్యాచ్ జ‌రుగుతోంది. టాస్ గెలిచిన భార‌త్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బంగ్లాదేశ్ మొద‌ట బ్యాటింగ్‌కు దిగింది. అయితే.. వ‌ర్షం కార‌ణంగా తొలి రోజు కేవ‌లం 35 ఓవ‌ర్ల ఆట మాత్ర‌మే సాధ్య‌మైంది. బంగ్లా 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. మోమినుల్‌ హక్‌ (40), ముష్ఫికర్‌ రహీం (6) లు క్రీజ్‌లో ఉన్నారు. భార‌త బౌల‌ర్ల‌లో ఆకాశ్‌దీప్ రెండు వికెట్లు తీశాడు. ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

ఇక ఈ మ్యాచ్‌లో ఓ ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ వీరాభిమాని టైగ‌ర్ రాబి పై దాడి జ‌రిగిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. బంగ్లా బ్యాటింగ్ చేస్తుండ‌గా సి బ్లాక్ లో ఉన్న రాబి.. త‌న దేశానికి మ‌ద్ద‌తుగా బంగ్లాదేశ్ జాతీయ జెండాను ఊపుతూ నినాలు చేశాడు. ఈ క్ర‌మంలో త‌న ముందు స్టాండ్స్‌లో ఉన్న భార‌త అభిమానుల‌తో అత‌డికి వాగ్వాదం చోటు చేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

Kamindu Mendis : టెస్టుల్లో కొనసాగుతున్న క‌మింద్ మెండిస్‌ దూకుడు.. డాన్ బ్రాడ్‌మ‌న్ రికార్డు స‌మం.. తొలి ఆసియా బ్యాట‌ర్‌గా..

ఇక లంచ్ విరామంలో అత‌డి పై కొంద‌రు ఫ్యాన్స్ దాడికి పాల్ప‌డ్డార‌ని వార్త‌లు వస్తున్నాయి. అత‌డిని పోలీసులు ఆస్ప‌త్రికి తీసుకువెలుతుండ‌గా మీడియాతో మాట్లాడాడు. పొత్తి క‌డుపులో, వీపు పై బ‌లంగా కొట్టార‌ని చెప్పాడు. దీంతో త‌న‌కు ఊపిరి తీసుకోవ‌డం క‌ష్ట‌మ‌వుతోంద‌న్నాడు. పోలీసులు, భ‌ద్ర‌తా సిబ్బంది త‌న‌ను ఆస్ప‌త్రికి తీసుకువెలుతున్న‌ట్లుగా చెప్పాడు.

కాగా.. దీనిపై పోలీసులు స్పందించాడు. రాబి పై దాడి జ‌రిగిందా? లేదా అనేది ఇంకా నిర్థార‌ణ కాలేద‌న్నారు. అత‌డు డీహైడ్రేష‌న్ వ‌ల్ల బాధ‌ప‌డుతున్నాడ‌ని చెప్పారు. సీసీ టీవీ పుటేజ్ ప‌రిశీలిస్తున్నామ‌న్నారు.

Ashwin : చ‌రిత్ర సృష్టించిన అశ్విన్‌.. టెస్టుల్లో ఆసియాలో అత్య‌ధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్‌గా..