టీమిండియా సెలక్టర్లకు నజరానా ప్రకటించిన బీసీసీఐ
భారత్‌కు ఇంతటి ప్రతిష్టాత్మక విజయం తెచ్చిపెట్టడం పట్ల బీసీసీఐ సెలక్టర్లకు కూడా క్యాష్ రివార్డులను ప్రకటించింది. సెలక్షన్ కమిటీలోని ఎమ్మెస్కే ప్రసాద్, శరణ్‌దీప్ సింగ్, జితిన్ పరన్జీపే, గగన్ ఖోడా, దేవాంగ్ గాంధీలకు తలో రూ.20 లక్షల చొప్పున క్యాష్ రివార్డుని అందజేస్తున్నట్టు బోర్డు మంగళవారం అధికారిక ప్రకటన చేసింది.

భారత్‌కు ఇంతటి ప్రతిష్టాత్మక విజయం తెచ్చిపెట్టడం పట్ల బీసీసీఐ సెలక్టర్లకు కూడా క్యాష్ రివార్డులను ప్రకటించింది. సెలక్షన్ కమిటీలోని ఎమ్మెస్కే ప్రసాద్, శరణ్‌దీప్ సింగ్, జితిన్ పరన్జీపే, గగన్ ఖోడా, దేవాంగ్ గాంధీలకు తలో రూ.20 లక్షల చొప్పున క్యాష్ రివార్డుని అందజేస్తున్నట్టు బోర్డు మంగళవారం అధికారిక ప్రకటన చేసింది.
సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనను ద్వైపాక్సిక సిరీస్ విజయాన్ని నమోదు చేసుకుని చారిత్రక విజయంతో పూర్తి చేసుకుంది టీమిండియా. తొలి సారి ఒక్కసారి సిరీస్ కూడా ఓడిపోకుండా పర్యటనను ముగించింది. టెస్టు సిరిస్‌ను, వన్డే సిరిస్‌ను 2-1తేడాతో సొంతం చేసుకున్న టీమిండియా అంతకముందు జరిగిన టీ20 సిరిస్‌ను సమం చేసింది.
భారత్‌కు ఇంతటి ప్రతిష్టాత్మక విజయం తెచ్చిపెట్టడం పట్ల బీసీసీఐ సెలక్టర్లకు కూడా క్యాష్ రివార్డులను ప్రకటించింది. సెలక్షన్ కమిటీలోని ఎమ్మెస్కే ప్రసాద్, శరణ్‌దీప్ సింగ్, జితిన్ పరన్జీపే, గగన్ ఖోడా, దేవాంగ్ గాంధీలకు తలో రూ.20 లక్షల చొప్పున క్యాష్ రివార్డుని అందజేస్తున్నట్టు బోర్డు మంగళవారం అధికారిక ప్రకటన చేసింది. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై బీసీసీఐ పాలకుల కమిటి ఛైర్మన్ వినోద్ రాయ్ ప్రశంసల వర్షం కురిపించాడు.
జట్టు ఎంపికలో సెలక్టర్లు ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలే ఆసీస్ గడ్డపై భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయని ఆయన కొనియాడారు. తొలి టెస్టుకు ముందే యువ ఓపెనర్ పృథ్వీ షా గాయపడటంతో.. ఫామ్‌లో లేని రాహుల్, మురళీ విజయ్‌లను సెలెక్టర్లు ఆ తర్వాతి రెండు టెస్టులకు పక్కనబెట్టారు. మూడో టెస్టులో మయాంక్ అగర్వాల్, హనుమ విహారీలను ఓపెనర్లుగా పంపి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పు మూడో టెస్టులో ఓపెనర్‌గా బరిలోకి దిగిన మయాంక్ అగర్వాల్ అద్భుత ప్రదర్శన చేశాడు.
మూడు వన్డేల సిరిస్‌లో సెలెక్టర్లు ధోనీకి మద్దతుగా నిలిచారు. గతేడాది పేలవ ప్రదర్శన చేసిన ధోనీపై నమ్మకముంచిన సెలక్టర్లు మరో అవకాశమిచ్చి తుది జట్టులో చోటు కల్పించారు. వారి నమ్మకాన్ని నిలబెట్టిన ధోని.. తొలి ద్వైపాక్షిక సిరీస్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు. మూడు వన్డేల సిరిస్‌లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు నమోదు చేసి కీలక విజయాన్ని అందించాడు.