టీమిండియా కొత్త కోచ్ రేసులో విదేశీయులు.. వారిద్దరివైపు బీసీసీఐ మొగ్గు ..?

భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టీమ్ఇండియా హెడ్ కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించింది. ప్ర‌స్తుత కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ప‌ద‌వీకాలం టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌తో ముగియ‌నుంది. ఈ క్ర‌మంలో కొత్త కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించింది.

టీమిండియా కొత్త కోచ్ రేసులో విదేశీయులు.. వారిద్దరివైపు బీసీసీఐ మొగ్గు ..?

Ricky Ponting and Stephen Fleming (credit_ google)

BCCI – Team India Head Coach : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టీమ్ఇండియా హెడ్ కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించింది. ప్ర‌స్తుత కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ప‌ద‌వీకాలం టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌తో ముగియ‌నుంది. ఈ క్ర‌మంలో కొత్త కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించింది. కోచ్‌కు కావాల్సిన అర్హ‌త‌లు, బాధ్య‌త‌ల‌ను వెల్ల‌డించింది. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు మే 27 సాయంత్రం 6 గంట‌లలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని బీసీసీఐ సూచించింది. అయితే, ఈసారి టీమిండియా కొత్త కోచ్ గా విదేశీ మాజీ ప్లేయర్ ఎంపికవుతారని తెలుస్తోంది. ఈ విభాగంలో ప్రధానంగా ఇద్దరు పేర్లను బీసీసీఐ పరిగణలోకి తీసుకుంటుందని సమాచారం.

Also Read : IPL 2024 : లక్నోపై ఢిల్లీ విజయం.. ప్లేఆఫ్‌కు చేరుకున్న రాజస్థాన్..!

టీమిండియా నూతన కోచ్ గా విదేశీయుడిని నియమించే విషయంలో బీసీసీఐ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. క్రికెట్ అడ్వైజరీ కమిటీ విదేశీ కోచ్ ను ఎంపిక చేస్తే నేను జోక్యం చేసుకోలేనని క్రికెట్ బోర్డు కార్యదర్శి జే షా గతవారం విలేకరులతో పేర్కొన్నారు. అదేవిధంగా, భారత్ క్రికెట్ లో వివిధ ఫార్మాట్ లకు వేర్వేరు కోచ్ లు ఉన్న సందర్భం లేదు. టీమిండియాలో ఆల్ ఫార్మాట్ ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఫార్మాట్ లలో చాలా మంది సాధారణ ఆటగాళ్లు ఉన్నారని షా తెలిపారు.

Also Read : IPL 2024 DC vs LSG : కీలక మ్యాచ్‌లో లక్నోపై 19 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం..

విదేశీ కోచ్ ఎంపికకు బీసీసీఐ ప్రాధాన్యతనిస్తే ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ రికీ పాంటింగ్, న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ స్టీఫెన్ ప్లెమింగ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు RevSportz ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం ప్లెమింగ్ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు, రికీ పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కోచ్ లు గా ఉన్నారు. వీరిద్దరు టీమిండియా నూతన కోచ్ కు దరఖాస్తు చేసుకుంటే బీసీసీఐ ప్రాధాన్యతనిచ్చే అవకాశాలు ఉన్నట్లు RevSportz పేర్కొంది. ఈ విషయంపై ప్లెమింగ్, పాంటింగ్ ఇద్దరి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. ఇద్దరూ ఐపీఎల్ కోచ్ లుగా కొనసాగుతున్నారు. వారికి భారత్ క్రికెట్ గురించి స్పష్టమైన అవగాహన ఉంది. కానీ, బీసీసీఐ దీర్ఘకాలిక కోచ్ కోసం చూస్తున్నట్లు జై షా ఇటీవల చెప్పాడు. మూడున్నరేళ్లు పని చేయడానికి వీరు సిద్ధంగా ఉంటారా అనేదికూడా అనుమానమే.

Also Read : BCCI : టీమ్ఇండియా హెడ్ కోచ్ కోసం బీసీసీఐ ప్ర‌క‌ట‌న‌.. కండీష‌న్స్ అప్లై..

స్వదేశీ కోచ్ ల విషయానికి వస్తే ప్రధానంగా వీవీఎస్ లక్ష్మణ్ పేరు వినిపిస్తుంది. అయితే, ప్రస్తుతం అతను జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఎన్సీఏ నుంచి లక్ష్మణ్ ను తప్పించే ఉద్దేశంలో బీసీసీఐ పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. మరోవైపు గౌతమ్ గంభీర్ పేరుకూడా తెరపైకి వస్తోంది. అయితే, వీరంతా కొత్త కోచ్ రేసులో ఉండాలంటే మే27 సాయంత్రం 6గంటలలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను బట్టి అర్హతలను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ నూతన కోచ్ ను ఎంపిక చేయనుంది.