KKR Captain Nitish Rana: కేకేఆర్ జట్టు కెప్టెన్ నితీశ్ రాణాకు షాకిచ్చిన బీసీసీఐ..
కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు కెప్టెన్ నితీశ్ రాణాకు బీసీసీఐ షాకిచ్చింది. పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ జట్టు విజయం సాధించినప్పటికీ నితీశ్‌కు నిరాశ తప్పలేదు.

KKR Captain Nitish Rana
KKR Captain Nitish Rana: ఐపీఎల్ 2023 సీజన్ లో మ్యాచ్‌లు క్రికెట్ ప్రియులకు ఉత్కంఠతను కలిగిస్తున్నాయి. చివరి ఓవర్ వరకు విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడుతుంది. తాజాగా సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సైతం చివరి బంతి వరకు ఇరు జట్ల ప్లేయర్స్‌ను, అభిమానులను టెన్షన్ కు గురిచేసింది. చివరి బంతికి రింకూ సింగ్ సిక్స్ కొట్టి కేకేఆర్ జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టులో కెప్టెన్ నితీశ్ రాణా, రసెల్ అద్భుత బ్యాటింగ్‌తో కోల్‌కతా జట్టు పంజాబ్ కింగ్స్ పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి.
IPL 2023, KKR vs PBKS: పంజాబ్ పై కోల్‌కతా గెలుపు.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
కోల్‌కతా జట్టు మ్యాచ్ గెలిచినప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్ నితీశ్ రాణాకు బీసీసీఐ షాకిచ్చింది. పంజాబ్ కింగ్స్ జట్టు, కేకేఆర్ జట్టు మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ జట్టు స్లో ఓవర్ రేట్ కారణంగా బీసీసీఐ నితీశ్‌కు జరిమానా విధించింది. స్లో ఓవర్ రేట్ అనేది ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కిందకు వస్తుంది. దీంతో జట్టు కెప్టెన్ నితీశ్ రాణాకు బీసీసీఐ రూ. 12లక్షలు జరిమానా విధించింది. ఈ ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ జట్టు పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉంది. 11 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు.. ఐదు మ్యాచ్ లు గెలిచింది. ఆరు మ్యాచ్‌లలో ఓటమిపాలైంది.
IPL 2023, KKR vs PBKS: ఉత్కంఠ పోరులో పంజాబ్‌పై కోల్‌కతా విజయం
ఇదిలాఉంటే.. ఈ ఐపీఎల్ సీజన్లో నితీశ్ రాణా జరిమానాను ఎదుర్కోవడం ఇది రెండోసారి. గత నెల 16న ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ నితీశ్ రాణాకు బీసీసీఐ జరిమానా విధించింది. ఈ మ్యాచ్‌లో రాణా ఔట్ అయిన తరువాత ముంబై ఇండియన్స్ బౌలర్ హృతిక్‌తో వాగ్వావాదానికి దిగాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న బీసీసీఐ రాణా మ్యాచ్ ఫీజులో 25శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది.