IPL 2023, KKR vs PBKS: పంజాబ్ పై కోల్‌కతా గెలుపు.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
ఐపీఎల్(IPL) 2023లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(Kolkata Knight Riders) విజయం సాధించింది.

KKR Win
IPL 2023, KKR vs PBKS: ఐపీఎల్(IPL) 2023లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(Kolkata Knight Riders) విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్నికోల్‌కతా ఐదు వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి ఛేదించింది.
కోల్‌కతా బ్యాటర్లలో నితీశ్ రాణా(51; 38 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో రాణించగా జేసన్ రాయ్(38; 24బంతుల్లో 8 ఫోర్లు) దూకుడుగా ఆడాడు. ఆఖర్లో రస్సెల్( 42; 23 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రింకూ సింగ్( 21 నాటౌట్; 10 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) లు ధాటిగా ఆడడంతో 6 వికెట్ల తేడాతో కోల్‌కతా గెలుపొందింది. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ రెండు వికెట్లు తీయగా, నాథన్ ఎల్లిస్ , హర్‌ప్రీత్ బ్రార్ చెరో వికెట్ పడగొట్టారు.
IPL 2023, KKR vs PBKS: ఉత్కంఠ పోరులో పంజాబ్‌పై కోల్‌కతా విజయం
ఆఖరి ఓవర్ సాగిందిలా..
ఆఖరి ఓవర్‌లో కోల్‌కతా విజయానికి 6 బంతుల్లో ఆరు పరుగులు అవసరం. అర్ష్‌దీప్ సింగ్ మొదటి బంతికి పరుగులు ఏమీ ఇవ్వలేదు. రెండో బంతికి రస్సెల్, మూడో బంతికి రింకూ సింగ్‌లు సింగిల్స్ తీశారు. నాలుగో బంతికి రస్సెల్ రెండు పరుగులు తీయగా, ఐదో బంతికి రస్సెల్ రనౌట్ అయ్యాడు. దీంతో ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. రింకూ సింగ్ ఫోర్ కొట్టాడు.
IPL 2023, KKR vs PBKS: ఈ లెక్కన పంజాబే గెలుస్తుందట.. ఇదేం లాజిక్ అండీ బాబు..?
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. శిఖర్ ధావన్(57; 47 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో రాణించగా జితేశ్ శర్మ(21; 18 బంతుల్లో 2 సిక్సర్లు) పర్వాలేదనిపించాడు. భానుకా రాజపక్స(0), లివింగ్ స్టోన్(15), సామ్ కరన్(4)లు విఫలం కాగా. ఆఖర్లో షారుక్ ఖాన్(21 నాటౌట్; 8 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), హర్‌ప్రీత్ బ్రార్( 17 నాటౌట్; 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడడంతో పంజాబ్ మంచి స్కోరు సాధించింది. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు, హర్షిత్ రాణా రెండు వికెట్లు తీయగా సుయాష్ శర్మ, నితీశ్ రాణా ఒక్కొ వికెట్ పడగొట్టారు.