Women IPL 2023: మహిళా ఐపీఎల్ జట్లు వేలం ప్రక్రియను ప్రారంభించిన బీసీసీఐ.. జనవరి 21వరకు లాస్ట్ డేట్..
బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే మహిళల ఐపీఎల్ టోర్నీలో జట్లను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న కంపెనీలు జనవరి 21వ తేదీలోపు టెండర్లలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది

Womens IPL 2023
Women IPL 2023: పురుషుల ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్) విజయవంతం కొనసాగుతుండటంతో మహిళల ఐపీఎల్ టోర్నీని నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైన విషయం విధితమే. ఈ ఏడాది మర్చి నుండి ఈ టోర్నీని ప్రారంభించే అవకాశాల ఉన్నాయి. ఈ క్రమంలో బీసీసీఐ వేగంగా అడుగులు వేస్తుంది. తాజాగా మహిళల ఐపీఎల్ కోసం జట్లను వేలం వేసే ప్రక్రియను ప్రారంభించింది. బీసీసీ ఇందుకోసం ప్రకటన విడుదల చేసింది.
బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే మహిళల ఐపీఎల్ టోర్నీలో జట్లను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న కంపెనీలు జనవరి 21వ తేదీలోపు టెండర్లలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం రూ.5లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ టెండర్ లో జట్టును దక్కించుకునే వీలులేకుంటే ప్రస్తుతం డిపాజిట్ చేసిన రూ. 5లక్షలు వెనక్కు ఇవ్వటం జరగదని బీసీసీఐ స్పష్టం చేసింది.
https://twitter.com/IPL/status/1610275088519290880?cxt=HHwWgIDTnaqq7NgsAAAA
ఇదిలాఉంటే పురుషుల ఐపీఎల్‌లోని కొన్ని ప్రాంఛైజీలు కూడా మహిళల ఐపీఎల్ జట్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయని సమాచారం. ఇదిలాఉంటే బీసీసీఐ ఇప్పటికే గత నెలలో మీడియా హక్కుల టెండర్‌ను విడుదల చేసిన విషయం విదితమే.