BCCI president to visit Pakistan : ముంబయి దాడుల తర్వాత మొదటిసారి పాక్‌లో పర్యటించనున్న బీసీసీఐ ప్రతినిధులు

2008 ముంబయి దాడుల తర్వాత మొట్టమొదటిసారి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రతినిధి బృందం పాకిస్థాన్ దేశంలో పర్యటించనుంది....

BCCI president to visit Pakistan : ముంబయి దాడుల తర్వాత మొదటిసారి పాక్‌లో పర్యటించనున్న బీసీసీఐ ప్రతినిధులు

BCCI president to visit Pakistan

Updated On : August 26, 2023 / 10:28 AM IST

BCCI president to visit Pakistan : 2008 ముంబయి దాడుల తర్వాత మొట్టమొదటిసారి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ప్రతినిధి బృందం పాకిస్థాన్ దేశంలో పర్యటించనుంది. (BCCI president to visit Pakistan) బీసీసీఐ టాప్ బాస్‌లు సెప్టెంబర్ 4న లాహోర్‌లో దిగి 7వ తేదీ వరకు అక్కడే ఉండి రెండు ఆసియా కప్ మ్యాచ్‌లను వీక్షించనున్నారు.

Shivraj Chouhan expands cabinet : మధ్యప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణ…ముగ్గురికి చోటు

ముంబయిలో 2008లో జరిగిన ఉగ్రదాడుల తర్వాత భారతదేశం- పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు నిలిపివేశారు. (visit Pakistan for first time since Mumbai attacks) 15 ఏళ్ల తర్వాత పాక్ ఆహ్వానంపై బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పాక్ దేశంలో పర్యటించి ఆసియా కప్ మ్యాచ్ లను వీక్షించనున్నారు.

Prime Minister Narendra Modi : రెండు దేశాల పర్యటన ముగించుకొని బెంగళూరు చేరిన మోదీ… చంద్రయాన్-3 బృందంతో భేటీ

గత కొన్నేళ్లుగా బీసీసీఐ, పీసీబీ మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండేవి. సెప్టెంబర్ 4న లాహోర్‌లోని గవర్నర్‌ హౌస్‌లో పీసీబీ ఇచ్చే అధికారిక విందు లో బిన్నీ, శుక్లా ఇద్దరూ తమ జీవిత భాగస్వాములతో కలిసి పాల్గొననున్నారు. ఇద్దరు బీసీసీఐ పెద్దలు సెప్టెంబర్ 5న ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్‌ని, మరుసటి రోజు జరిగే పాకిస్థాన్ ఓపెనింగ్ సూపర్ ఫోర్ మ్యాచ్‌ను వీక్షించనున్నారు.