Beijing Winter Olympics 2022 : చైనాలో వింటర్ ఒలింపిక్స్.. భారత్ నుంచి పాల్గొనేది ఒక్క అథ్లెట్
వింటర్ ఒలింపిక్స్ వేడుకలకు భారత్ దూరంగా ఉంది. ముగింపు వేడుకల్లో పాల్గొనబోమని స్పష్టం చేసింది. టార్చ్ బేరర్ గా గల్వాన్ ఘటనతో ప్రమేయం ఉన్న ఆర్మీ అధికారి ఎంపిక చేయడంతో వింటర్ ఒలింపిక్

Beijing 2022
Winter Olympics 2022 Arif Khan : బీజింగ్ వేదికగా వింటర్ ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. 90 దేశాల నుంచి సుమారు 3 వేల మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. వారం రోజుల పాటు జరిగే వింటర్ ఒలింపిక్స్ లో 7 క్రీడల్లో మొత్తం 109 విభాగాల్లో పోటీలు సాగనున్నాయి. కోవిడ్ దృష్ట్యా విదేశీ వీక్షకులకు అనుమతి నిరాకరించింది. వింటర్ ఒలింపిక్స్ లో భారత్ నుంచి ఒక్క అథ్లెట్ మాత్రమే పాల్గొననున్నారు. స్కీయింగ్ లో జమ్మూకాశ్మీర్ కు చెందిన ఆరిఫ్ ఖాన్ స్లాలోమ్ జెయింట్ స్లాలోమ్ పోటీ చేస్తున్నారు. ఆరిఫ్ ఖాన్ 1964 నుంచి వింటర్ ఒలింపిక్స్ లో పోటీ పడుతున్నారు. వింటర్ ఒలింపిక్స్ లో ఒక్కరే అథ్లెట్ పాల్గొనడం ఇదే తొలిసారి.
Read More : Exams in Bihar : కారు హెడ్ లైట్ల కాంతిలో పరీక్ష రాసిన 12వ తరగతి విద్యార్ధులు
వింటర్ ఒలింపిక్స్ వేడుకలకు భారత్ దూరంగా ఉంది. ముగింపు వేడుకల్లో పాల్గొనబోమని స్పష్టం చేసింది. టార్చ్ బేరర్ గా గల్వాన్ ఘటనతో ప్రమేయం ఉన్న ఆర్మీ అధికారి ఎంపిక చేయడంతో వింటర్ ఒలింపిక్స్ వేడుకలకు దూరంగా ఉండాలని భారత్ నిర్ణయం తీసుకుంది. క్వీ ఫబోవో…గల్వాన్ లోయ దాడిలో పాల్గొన్న కమాండర్ మాత్రమే కాదు… అతడు ఉయిగర్ ముస్లీంల ఊచకోతకు కారణమైన వ్యక్తి కూడా..! అలాంటి వ్యక్తిని విశ్వక్రీడలకు టార్చ్‌బేరర్‌గా ఎంచుకోవడాన్ని అన్ని దేశాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. అసలు ఇలాంటి చర్యల ద్వారా చైనా ప్రపంచానికి ఎలాంటి సంకేతాలు పంపాలనుకుంటోందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే భారత సార్వభౌమత్వానికి, ఉయిగర్ల స్వేచ్ఛకు అమెరికా ఎప్పుడూ మద్ధతు ఇస్తూనే ఉంటుందని.. యూఎస్ సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ ర్యాంకింగ్ మెంబర్ ట్వీట్ చేశారు. చైనాలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌ను బహిష్కరించాలంటూ అమెరికా, ఆస్ట్రేలియా, కొన్ని యూరప్ దేశాలు కూడా ప్రతిపాదించాయి.