Betting App Case : మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, ఉతప్పలతో పాటు నటుడు సోనూసూద్‌కు ఈడీ సమన్లు
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో(Betting App Case) టీమ్ఇండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పలతో పాటు నటుడు సోనూసూద్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది.

Betting App Case ED Summons Yuvraj Singh Robin Uthappa and Sonu Sood
Betting App Case : ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో టీమ్ఇండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పలతో పాటు నటుడు సోనూసూద్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది.
సెప్టెంబర్ 22న రాబిన్ ఉతప్ప, 23న యువరాజ్ సింగ్, 24న సోనూసూద్ విచారణకు హాజరుకావాలని నోటిసుల్లో పేర్కొంది. నిషేదిత ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ లావాదేవీల్లో మనీలాండరింగ్‌కు సంబంధించి ఉతప్పను ఈడీ ప్రశ్నించనుంది.
Team india : టీమ్ఇండియా కొత్త జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్.. ఒక్కొ మ్యాచ్‌కు ఎంతంటే..?
ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఈ కేసులో మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్లను ఈడీ ప్రశ్నించింది. బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసినందుకు వారిని ఈడీ విచారించింది. నటి ఊర్వశీ రౌతేలా 1xBet బెట్టింగ్ యాప్‌నకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఆమెకు కూడా నోటీసులు వెళ్లాయి. ఇదే కేసులో సోమవారం తృణమూల్ ఎంపీ మిమి చక్రవర్తిని ఈడీ ప్రశ్నించింది.
నిషేదిత బెట్టింగ్ యాప్(Betting App Case)లు ఎంతో మందిని లూటీ చేసినట్లుగా ఈడీ విచారణలో తేలింది. పెట్టుబడిదారులు కోట్లు వసూలు చేసి పన్నులు ఎగవేసినట్లుగా వెల్లడైంది.