Sonam Yeshey : వీడెవండీ బాబు.. బాల్ వేస్తే వికెట్ పడాల్సిందే.. టీ20 మ్యాచ్‌లో 8 వికెట్లు.. చరిత్ర సృష్టించిన భూటాన్ బౌలర్ సోనమ్ యెషే
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సోనమ్ యెషే (Sonam Yeshey) అరుదైన ఘనత సాధించాడు.
Bhutan player Sonam Yeshey becomes first ever player to pick 8 wickets in a T20I match
Sonam Yeshey : అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సోనమ్ యెషే అరుదైన ఘనత సాధించాడు. శుక్రవారం (డిసెంబర్ 26న) మయన్మార్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఓ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో 8 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ ఎడమచేతి వాటం ఆర్థోడాక్స్ స్పిన్నర్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు పడగొట్టాడు.
A spell for the ages! Sonam Yeshey’s unbelievable 8/7 in 4 overs goes down as a world record. @ICC #bhutanmyanmarseries #worldrecord pic.twitter.com/kBpmYjr8BH
— BhutanCricketOfficial🇧🇹 (@BhutanCricket) December 26, 2025
Doug Bracwell : క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ బ్రేస్‌వెల్..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భూటాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు సాధించింది. అనంతరం 128 పరుగుల లక్ష్య ఛేదనలో సోనమ్ యెషే ధాటికి యమన్మార్ 9.2 ఓవర్లలో 45 పరుగులకే కుప్పకూలింది. సోనమ్ యెషే 8 వికెట్లు తీయగా ఆనంద్ మోంగర్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో భూటాన్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే సొంతం చేసుకుంది.
ఓ టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
* సోనమ్ యెషే (భూటాన్) – 8 వికెట్లు
* స్యాజ్రుల్ ఇద్రుస్ (మలేషియా) – 7 వికెట్లు
* అలీ దావుద్ (బహ్రెయిన్) -7 వికెట్లు
* హర్ష్ భరద్వాజ్ (సింగపూర్) – 6 వికెట్లు
– పీటర్ అహో (నైజీరియా) – 6 వికెట్లు
