Doug Bracwell : క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన న్యూజిలాండ్ ఆల్‌రౌండ‌ర్ బ్రేస్‌వెల్‌..

న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ డగ్ బ్రేస్‌వెల్ (Doug Bracwell) క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు.

Doug Bracwell : క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన న్యూజిలాండ్ ఆల్‌రౌండ‌ర్ బ్రేస్‌వెల్‌..

New Zealand all rounder Doug Bracwell announced retirement from all formats of game

Updated On : December 29, 2025 / 11:56 AM IST

Doug Bracwell : న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ డగ్ బ్రేస్‌వెల్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. గ‌త కొద్ది రోజులుగా అత‌డు ప‌క్క‌టెముక‌ల గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. ఇటీవ‌ల గాయం తీవ్ర‌త ఎక్కువ కావ‌డంతో దేశ‌వాళీలో సెంట్ర‌ల్ డిస్టిక్స్ త‌రుపున కూడా ఆడ‌లేక‌పోయాడు. ఈక్ర‌మంలోనే అత‌డు ఆట‌కు వీడ్కోలు ప‌లికాడు.

35 ఏళ్ల ఈ ఆట‌గాడు 2011లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్ త‌రుపున అరంగ్రేటం చేశాడు. 2023లో అత‌డు బ్లాక్‌క్యాప్స్ త‌రుపున చివ‌రి సారిగా ప్రాతినిధ్యం వ‌హించాడు. అంత‌ర్జాతీయ కెరీర్‌లో అత‌డు కివీస్ త‌రుపున 28 టెస్టులు, 21 వ‌న్డేలు, 20 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 74 వికెట్లు తీయ‌డంతో పాటు 568 ప‌రుగులు చేశాడు. వ‌న్డేల్లో 26 వికెట్లు ప‌డ‌గొట్ట‌డంతో పాటు 221 ప‌రుగులు సాధించాడు. ఇక టీ20ల్లో 20 వికెట్లు తీయ‌డంతో పాటు 126 ప‌రుగులు సాధించాడు.

BBL : బిగ్‌బాష్ లీగ్‌లో మాక్స్‌వెల్ అరుదైన ఘ‌న‌త‌.. క్రిస్‌లిన్ త‌రువాత ఈ ఘ‌న‌త సాధించిన ఒకే ఒక్క‌డు..

హోబార్ట్ వేదికగా ఆస్ట్రేలియాపై 2011లో న్యూజిలాండ్ చారిత్రక టెస్ట్ విజ‌యాన్ని సాధించింది. ఈ విజ‌యంలో బ్రేస్‌వెల్ కీల‌క పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అతడు 6 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ మ్యాచ్‌లో కివీస్ 7 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

Smriti Mandhana : మొన్న పెళ్లి ర‌ద్దు.. నేడు చ‌రిత్ర సృష్టించిన స్మృతి మంధాన‌.. మ‌హిళ‌ల క్రికెట్‌లో ఏకైక ప్లేయ‌ర్‌

‘ఇది నా జీవితంలో ఎంతో గ‌ర్వించ‌ద‌గ్గ క్ష‌ణం. చిన్న‌ప్ప‌టి నుంచి క్రికెట్ ఆడాల‌నేది నా క‌ల‌. కివీస్‌కు ప్రాతినిధ్యం వ‌హించ‌డం గొప్ప గౌర‌వం. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌, అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడ‌డం అదృష్టం. నా ప్ర‌యాణంలో స‌హ‌క‌రించిన అంద‌రికి కృత‌జ్ఞ‌త‌లు.’ అని బ్రేస్ వెల్ అన్నాడు.