Asia Cup 2023 : శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు షాక్.. దినేశ్ కార్తీక్ ట్వీట్‌కు అర్థం అదేనా..?
ఆసియాకప్ (Asia Cup 2023) లో టీమ్ఇండియా అద్భుత ప్రదర్శనతో ఫైనల్ కు చేరుకుంది. ఆదివారం శ్రీలంక జట్టుతో తలపడనుంది. అయితే.. ఫైనల్ మ్యాచ్ కు ముందు టీమ్ఇండియా (Team India) కు ఊహించని షాక్ తగిలింది.
Asia Cup 2023 final : ఆసియాకప్ (Asia Cup 2023) లో టీమ్ఇండియా అద్భుత ప్రదర్శనతో ఫైనల్ కు చేరుకుంది. ఆదివారం శ్రీలంక జట్టుతో తలపడనుంది. అయితే.. ఫైనల్ మ్యాచ్ కు ముందు టీమ్ఇండియా (Team India) కు ఊహించని షాక్ తగిలింది. సూపర్-4 దశలో చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పై భారత్‌ను గెలిపించేందుకు విశ్వ ప్రయత్నం చేసిన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) గాయపడ్డాడు. దీంతో అతడు ఫైనల్ మ్యాచ్‌కు దూరం అయినట్లు తెలుస్తోంది.
బంగ్లాతో మ్యాచ్‌లో స్టంపౌట్ నుంచి తప్పించుకునేందుకు అక్షర్ ప్రయత్నించగా అతడి కుడి చేతి చిటికెన వేలికి గాయమైంది. కొద్దిసేపటి తరువాత బంగ్లా ఫీల్డర్ విసిరిన ఓ బంతి అక్షర్ చేతిని తాకింది. ఫిజియో సాయంతో పట్టీ వేసుకున్న అక్షర్ నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేశాడు. అతడు ఫైనల్ మ్యాచ్‌కు కోలుకోవడం కష్టమే. ఈ క్రమంలో అతడి స్థానాన్ని భర్తీ చేయాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్ణయించింది.
యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) ను శ్రీలంక పంపినట్లు తెలుస్తోంది. ‘అక్షర్ ప్రస్తుతం అనేక గాయాలతో బాధపడుతున్నాడు. అతడి చిటికెన వేలికి గాయమైంది, ముంజేయికి దెబ్బ తగిలింది. తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ప్రస్తుతం అక్షర్ విశ్రాంతి తీసుకుంటున్నాడు.’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. వన్డే ప్రపంచకప్ కు సమయం దగ్గర పడుతుండడంతో అతడు ఈ మెగాటోర్నీలో ఆడతాడా..? లేదా..? అనే అనుమానం ఫ్యాన్స్‌లో నెలకొంది.
దినేశ్ కార్తీక్ ట్వీట్‌కు అర్థం అదేనా..?
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు, క్రికెట్ వ్యాఖ్యత అయిన దినేశ్ కార్తిక్ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ‘ఎయిర్ పోర్టులో అనుకోకుండా నాకు వాషింగ్టన్ సుందర్ కనపడ్డాడు. అతడు ఎక్కడికి వెలుతున్నాడో గెస్ చేయండి.’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో వాషింగ్టన్ సుందర్ శ్రీలంక బయలుదేరాడని నెటీజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే.. వాషింగ్టన్ సుందర్ కు ఫైనల్ మ్యాచులో తుది జట్టులో చోటు దక్కుందా లేదో చూడాలి.
Ravindra Jadeja : వన్డేల్లో రవీంద్ర జడేజా అరుదైన ఘనత.. ఎలైట్ లిస్ట్‌లో చోటు..
Washington Sundar bumped into me at the airport
Guess where he’s off to Twitter ???
???
— DK (@DineshKarthik) September 16, 2023