Prithvi Shaw-Sapna Gill: పృథ్వీ షాకు షాక్‌.. నోటీసులు జారీ చేసిన బాంబే హైకోర్టు

బాంబే హైకోర్టు పృథ్వీ షాకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్ర‌వ‌రిలో సోష‌ల్ మీడియా ఇన్‌ప్లూయోన్స‌ర్ స‌ప్నా గిల్‌తో సెల్ఫీ వివాదంలో నేప‌థ్యంలో విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ న్యాయ‌స్థానం నోటీసులు పంపింది.

Prithvi Shaw-Sapna Gill: పృథ్వీ షాకు షాక్‌.. నోటీసులు జారీ చేసిన బాంబే హైకోర్టు

Sapna Gill-Prithvi Shaw

Updated On : April 14, 2023 / 4:40 PM IST

Prithvi Shaw-Sapna Gill: ప్ర‌స్తుతం పృథ్వీ షా(Prithvi Shaw)కు బ్యాడ్ టైమ్ న‌డుస్తుంది. ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో దారుణంగా విఫ‌లం అవుతున్న అత‌డికి మ‌రో షాక్ త‌గిలింది. బాంబే హైకోర్టు(Bombay High Court) పృథ్వీ షాకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్ర‌వ‌రిలో సోష‌ల్ మీడియా ఇన్‌ప్లూయోన్స‌ర్ స‌ప్నా గిల్‌( Sapna Gill) “సెల్ఫీ వివాదం” నేప‌థ్యంలో విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ న్యాయ‌స్థానం నోటీసులు పంపింది. పృథ్వీ షాతో పాటు ముంబై పోలీసుల‌కు నోటీసులు ఇచ్చింది.

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి నెల‌లో ఓ హోట‌ల్ వ‌ద్ద సెల్పీ ఇవ్వాల‌ని సప్నా గిల్, ఆమె స్నేహితులు అడిగిన క్ర‌మంలో వీరిద్ద‌రి మ‌ధ్య వివాదం చోటుచేసుకుంది. ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. గొడ‌వ జ‌రిగిన స‌మ‌యంలో షా త‌న‌ను అభ్యంత‌ర‌క‌రంగా తాకాడాని, గొడ‌వలో త‌న త‌ప్పు ఏమీ లేద‌ని, ఈ విష‌యంపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికి స్వీక‌రించ‌డం లేద‌ని ఏప్రిల్ తొలి వారంలో స‌ప్నా కోర్టును ఆశ్ర‌యించింది.

Prithvi Shaw – Sapna Gill : ఇండియన్ క్రికెటర్ పృథ్వీ షా పై దాడి చేసిన నటి అరెస్ట్..

ఘ‌ట‌న‌కు సంబంధించిన సీసీ టీవీ పుటేజీని ప‌రిశీలిస్తే అస‌లు విష‌యం అర్థం అవుతుంద‌ని స‌ప్నా గిల్ త‌రుపు న్యాయ‌వ్యాధి అలీ కాశిఫ్ ఖాన్ తెలిపారు. క్రికెట‌ర్‌తో పోలీసులు చేతులు క‌లిపి త‌న క్లైంట్‌పై త‌ప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశార‌ని న్యాయ‌స్థానానికి విన్న‌వించారు. పృథ్వీ షాతో పాటు అత‌డికి స‌హ‌క‌రించిన పోలీసుల‌పై త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం విచార‌ణ‌కు హాజ‌రుకావాలంటూ పృథ్వీ షాతో పాటు ముంబై పోలీసుల‌కు నోటీసులు జారీ చేసింది.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో పృథ్వీ షా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు. ఆడిన నాలుగు మ్యాచుల్లో దారుణంగా విఫ‌లం అయ్యాడు. ఈ నేప‌థ్యంలో అత‌డిని జ‌ట్టు నుంచి తొల‌గించాల‌న్న డిమాండ్లు ఊపందుకున్నాయి.

Prithvi Shaw Sapna Gill Selfie Row: పృథ్వీ షా ఎవరో తెలియదు.. మేము ఇద్దరే ఉన్నాం.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన సప్నా గిల్‌