IPL 2025 Tickets: ఐపీఎల్ 2025 హైదరాబాద్ లో SRH మ్యాచ్ ల టికెట్లు ఇలా బుక్ చేసుకోండి..

ఐపీఎల్ -2025 సీజన్లో ఉప్పల్ స్టేడియంలో జరిగే SRH మ్యాచ్ ను స్టేడియంకు వెళ్లి చూడాలంటే టికెట్లు ఇలా బుక్ చేసుకోండి..

IPL 2025 Tickets: ఐపీఎల్ 2025 హైదరాబాద్ లో SRH మ్యాచ్ ల టికెట్లు ఇలా బుక్ చేసుకోండి..

Uppal Stadium

Updated On : February 17, 2025 / 2:20 PM IST

IPL 2025 Tickets: భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ సందడి షురూ కానుండగా.. మే 25న ఫైనల్ పోరు జరగనుంది. ఈ సీజన్ లో 65 రోజుల పాటు 74 మ్యాచ్ లు 13 వేదికల్లో జరగనున్నాయి. ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటని చెప్పొచ్చు. అయితే, ఐపీఎల్ 2025 టైటిల్ వేటను సన్ రైజర్స్ హైదరాబాద్ మార్చి 23న రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ తో ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం అవుతుంది.

Also Read: IPL 2025: పాండ్యా ఔట్.. ముంబై పగ్గాలు మళ్లీ రోహిత్ కి.. ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ లో..

ఐపీఎల్-2025 సీజన్ లో హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో ఏడు లీగ్ దశ మ్యాచ్ లతో పాటు, క్వాలిఫయర్ -1, ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఎస్ఆర్ హెచ్ జట్టు మార్చి 23న ఆర్‌ఆర్‌తో, మార్చి 27న ఎల్‌ఎస్‌జీతో, ఏప్రిల్ 6న జీటీతో, ఏప్రిల్ 12న పీబీకేఎస్‌తో, ఏప్రిల్ 23న ముంబైతో, మే 5న ఢిల్లీతో, మే 10న కేకేఆర్‌ జట్టుతో ఉప్పల్ స్టేడియంలో (హోంగ్రౌండ్) మ్యాచులు ఆడనుంది. ఒకవేళ ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు ప్లే ఆఫ్స్ చేరితే ఏడు కంటే ఎక్కువ మ్యాచ్ లను హోంగ్రౌండ్ లో ఆడుతుంది.

Also Read: Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ వేళ ఆ ఇద్దరు ప్లేయర్ల విషయంలో గంభీర్, అగార్కర్ మధ్య వాగ్యుద్దం.. రోహిత్ ఎవరి వైపు అంటే?

ఐపీఎల్ 2025 సీజన్లో ఉప్పల్ స్టేడియంలో జరిగే SRH మ్యాచ్ ను స్టేడియంకు వెళ్లి చూడాలంటే టికెట్లు ఇలా బుక్ చేసుకోండి..
♦ అధికారిక టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌కు వెళ్లండి: ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం ఆన్‌లైన్ టికెట్ అమ్మకాలను సాధారణంగా నిర్వహిస్తున్న బుక్‌మైషో లేదా పేటిఎమ్ వంటి విశ్వసనీయ ప్లాట్‌ఫారమ్‌లకు వెళ్లండి. టికెట్ అమ్మకాలకు ప్రత్యక్ష లింక్‌ల కోసం మీరు అధికారిక సన్‌రైజర్స్ హైదరాబాద్ వెబ్‌సైట్‌ను కూడా తనిఖీ చేయవచ్చు.

♦ మీ మ్యాచ్ ను ఎంచుకోండి : మీరు ఎంపిక చేసుకున్న ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న మ్యాచ్ లిస్ట్ నుండి మీకు కావాల్సిన హైదరాబాద్ జట్టు మ్యాచ్ ను ఎంచుకోండి. ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ అయితే టికెట్ల వేగంగా అమ్ముడయ్యే అవకాశం ఉంది. ఆ మ్యాచ్ టికెట్ల కోసం సాధ్యమైనంత త్వరగా మీరు బుక్ చేసుకుంటే మంచిది.

♦ సీట్లను ఇలా ఎంచుకోండి: మీరు వెళ్లాల్సిన మ్యాచ్ ను ఎంచుకున్న తరువాత, అందుబాటులో ఉన్న సీటింగ్ విభాగాలను తనిఖీ చేయండి. మీ ఎంపికలో స్టేడియం ఎగువ శ్రేణి, ప్రీమియం సీట్లు, వీఐపీ బాక్స్‌లు ఉంటాయి. మీరు ఎంపిక చేసుకునే సీట్ల ఆధారంగా టికెట్ ధరలు మారుతూ ఉంటాయి.

♦ ఇలా చెల్లింపు చేయండి : మీరు మీ సీట్లను ఎంచుకున్న తర్వాత, మీ కార్టులో చేర్చి చెక్ అవుట్ కు వెళ్లండి. క్రెడిట్/డెబిట్ కార్డులు, యుపిఐ లేదా పేటీఎం వంటి మొబైల్ వాలెట్ల ద్వారా చెల్లింపు చేయవచ్చు.

♦ టికెట్లు పొందండి ఇలా: విజయవంతమైన చెల్లింపు తర్వాత, మీరు మీ ఈ-మెయిల్ లేదా టికెటింగ్ యాప్ ద్వారా ఇ-టికెట్ అందుకుంటారు. మ్యాచ్ రోజున స్టేడియంలోకి వెళ్లడానికి మీకు సంబంధించిన ఐడీ ప్రూప్స్ తోపాటు దీన్ని తీసుకెళ్లాలి.