రెండోటెస్ట్‌లో ఇండియా చేతులెత్తేయడంతో న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్

భారత్‌తో జరుగిన రెండో టెస్టు మ్యాచ్‌లో స్వల్ప లక్ష్య ఛేదనలో ఆతిథ్య కివీస్ భారత్‌పై ఘన విజయం సాధించింది న్యూజిలాండ్. ఇండియా నిర్ధేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు క్రీజులోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్ ఓపెనర్లు టామ్ లాథమ్(52), బ్లండెల్(55) రాణించగా.. ఏడు వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది కివీస్ జట్టు.
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 242పరుగులు చెయ్యగా.. బౌలర్లు కష్టపడి ప్రత్యర్థిని తమకంటే తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశారు.. అయితే తర్వాత రెండవ ఇన్నింగ్స్ ఆడిన భారత్ బ్యాట్స్‌మెన్ మళ్లీ జట్టుని కష్టాల్లోకి పెట్టారు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ టెయిలెండర్ జేమీసన్ చక్కగా 49 పరుగులు చేశాడు.
కానీ రెండో ఇన్నింగ్స్‌లో మన స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా (14), మయాంక్ అగర్వాల్ (3), కోహ్లి (14), రహానే (9)లు అంతా కలిసి కూడా అన్ని పరుగులు చెయ్యలేదు. ఛటేశ్వర్ పుజారా కొట్టిన 24పరుగులే టీమ్ లో హయ్యస్ట్ స్కోర్.
దీంతో టెస్ట్ సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన కివీస్ 2-0తో లీడింగ్‌లో ఉంది.