Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్‌కు మద్దతుగా బ్రెట్ లీ.. విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్

అర్జున్ టెండూల్కర్‌ ఆటతీరుపై విమర్శలు చేస్తున్న వారికి ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ బ్రెట్ లీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్‌కు మద్దతుగా బ్రెట్ లీ.. విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్

Arjun Tendulkar

Updated On : April 26, 2023 / 1:54 PM IST

Arjun Tendulkar: ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు తరపున అర్జున్ టెండూల్కర్ అరంగ్రేటం చేశాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు కావటంతో అర్జున్ ఆటతీరును ప్రతీఒక్కరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. అర్జున్ ఆడిన మొదటి మ్యాచ్ లో పర్వాలేదనిపించినా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం పరుగులు భారీగా ఇచ్చాడు. మూడు ఓవర్లు వేసి ఏకంగా 48 పరుగులు సమర్పించుకున్నాడు. దీనికితోడు మైదానంలో అర్జున్ టెన్షన్ గా కనిపిస్తున్నాడు. దీంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. మంగళవారం రాత్రి గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో అర్జున్ రెండు ఓవర్లు వేసి కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఒక వికెట్ కూడా తీసుకున్నాడు.

IPL 2023, GT vs MI: చేతులెత్తేసిన బ్యాట‌ర్లు.. ముంబై పై గుజ‌రాత్ ఘ‌న విజ‌యం

అర్జున్ టెండూల్కర్‌ ఆటతీరుపై విమర్శలు చేస్తున్న వారికి ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ లీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అర్జున్ కు చిన్న వయస్సు. అతనికి అద్భుత కెరీర్ ఉంది. అతడి బౌలింగ్ పేస్ బాగుంది. నిలకడగా 140 కిలో మీటర్ల స్పీడ్ తో బాల్ వేస్తున్నాడు. తప్పకుండా ముంబయి జట్టుకు అద్భుత ప్రదర్శన ఇవ్వగలడని బ్రెట్ లీ అన్నారు.

IPL 2023: ల‌క్నోకు భారీ షాక్‌.. తండ్రి కాబోతున్న కీల‌క ఆట‌గాడు.. లీగ్‌కు దూరం..!

అర్జున్ టెండూల్కర్‌కు బ్రెట్ లీ పలు సూచనలు చేశారు. ఎలా బౌలింగ్ చేయాలని అనుకుంటున్నావో అలా చెయ్.. విమర్శలు చేసేవారిని పట్టించుకోకు. నీపై విమర్శలు చేసేవారంతా జీవితంలో ఒక్కసారికూడా బాల్ పట్టి ఉండరు. వారంతా కీ బోర్డు వారియర్లు అంటూ బ్రెట్ అలీ అన్నారు. ఇదిలాఉంటే గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో చివరిలో బ్యాటింగ్ కు వచ్చిన అర్జున్ మంచి ప్రదర్శన ఇచ్చాడు. ఓ సిక్స్ తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ సీజన్ లో అర్జున్ కు అదే తొలి సిక్స్.