జాదవ్ బర్త్ డే గిఫ్ట్‌గా ధోనీ సేన ఏం చేసిందంటే..

జాదవ్ బర్త్ డే గిఫ్ట్‌గా ధోనీ సేన ఏం చేసిందంటే..

Updated On : March 27, 2019 / 7:57 AM IST

చెన్నై సూపర్ కింగ్స్ లీగ్‌లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా ఢిల్లీ యువ క్రికెటర్లపై సత్తా చాటింది ధోనీసేన. మ్యాచ్ చివరి ఓవర్ల వరకూ క్రీజులో ధోనీతో పాటు జట్టుకు సహకారం అందించిన కేదర్ జాదవ్ 148 పరుగుల చేధనలో కీలకంగా నిలిచాడు. దీంతో చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Read Also : కష్టాల్లో ఉన్నాడేమో : రూ.40 కోట్లు ఇప్పించండి.. సుప్రీంకోర్టులో ధోనీ

అదే రోజు కేదర్ జాదవ్ పుట్టినరోజు కావడంతో మ్యాచ్ అనంతరం ధోనీ జట్టంతా సంబరాల్లో మునిగిపోయారు. కేదర్‌తో కేక్ కట్ చేయించి ముఖానికి పూశారు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేల్లోనూ కేదర్.. ధోనీకి చక్కని సహకారం అందించాడు. రబాడ అందుబాటులో లేకపోవడంతో చెన్నై జట్టులో చోటు దక్కించుకున్నాడు కేదర్ జాదవ్. 

పిచ్ అంతగా సహకరించకపోయినా చేధనలో మాత్రం ఏ తడబాటుకు లోనుకాకుండా చక్కగా ఆడింది చెన్నై. ఐపీఎల్ 2019లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తన తర్వాతి మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్‌తో మార్చి 31న చెన్నై వేదికగా చిదంబరం స్టేడియంలో ఆడనుంది. 

Read Also : ఐపీఎల్ టాప్ 5 ప్లేయర్లలో ధావన్