Smriti Mandhana : స్మృతి మంధాన కోసం 1200కి.మీ ప్రయాణించిన చైనా అభిమాని.. ఆమె ఓ దేవత..
భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందంతోనే కాదు, ఆటతోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
Smriti Mandhana The Goddess : భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందంతోనే కాదు, ఆటతోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఆమెకు భారత్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే.. మిగిలిన దేశాల్లోని అభిమానుల సంగతి ఎలాగున్నా సరే.. ఆమెకు చైనా దేశంలో ఓ వీరాభిమాని ఉన్నాడు. అదేంటీ..? మనదేశంలో కూడా అలాంటి వారు ఉంటారు అని అంటారా..? నిజమే కానీ.. క్రికెట్ గురించి పెద్దగా తెలియని చైనా దేశంలో ఫ్యాన్ ఉండడం గ్రేట్ కదా.. అంతేనా మంధాన ఆటను చూసేందుకు అతడు ఏకంగా 1200 కిలోమీటర్లు ప్రయాణం చేయడం గమనార్హం.
చైనాలోని హాంగ్జౌ నగరంలో ఏసిషన్ గేమ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకను 19 పరుగుల తేడాతో ఓడించి స్వర్ణ పతకం గెలుచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ చూసేందుకు జున్ యు (Jun Yu) అనే వ్యక్తి బీజింగ్ నుంచి హాంగ్జౌ వచ్చాడు. అతడు మంధాన ను ఓ దేవతలా ఆరాధిస్తున్నాడు. ‘మంధాన ది గాడెస్’ అని రాసి ఉన్న ఓ ఫ్లకార్డును పట్టుకుని నిలుకోగా కెమెరాలు అతడిపై ఫోకస్ చేశాయి.
Babar Azam Fined : బాబర్ ఆజాంకు షాకిచ్చిన పోలీసులు.. కారును ఆపి మరీ..!
మ్యాచ్ అనంతరం ఓ రిపోర్టర్ అతడితో మాట్లాడారు. తాను మంధాన కు మాత్రమే అభిమాని కాదని, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీలకు కూడా అభిమాని అని చెప్పాడు. తాను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఫాలో అవుతానన్నాడు. వాళ్లు గొప్ప ఆటగాళ్లు అని, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా కూడా మంచి ప్లేయర్లు అని అన్నాడు. 2019 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై బుమ్రా బౌలింగ్ అద్భుతం అని కొనియాడాడు. ఇక తాను బీజింగ్‌లోని తన యూనివర్సిటీలో క్రికెట్ పాఠాలు నేర్చుకున్నట్లు తెలిపాడు.
చైనాలో క్రికెట్‌ను ఎక్కువగా చూడరని, దీని గురించి ఎక్కువ మందికి తెలియదని చెప్పాడు. అందుకనే క్రికెట్ మైదానాలు చాలా తక్కువగా ఉన్నాయన్నాడు. 2010 ఆసియా క్రీడల సమయంలో క్రికెట్ ఆడిన గ్వాంగ్‌జౌలో మాత్రమే శాశ్వత క్రికెట్ స్టేడియం ఉందని పేర్కొన్నాడు. ప్రస్తుతం మ్యాచ్‌లు నిర్వహిస్తున్న ఈ స్టేడియం ఆసియా క్రీడలకు ముందు ఓ పూలతోట అని చెప్పాడు. ఆసియా క్రీడల కోసం క్రికెట్ మైదానంగా మార్చారని, కొన్ని సన్నాహక మ్యాచులు ఆడిన తరువాత ఆసియా క్రీడలను ఇక్కడ నిర్వహిస్తున్నట్లు చెప్పాడు.
Smriti Mandhana : నిజంగా ఇది ఎంతో ప్రత్యేకం.. నా కళ్లలో నీళ్లు తిరిగాయి
తాను ఎక్కువగా భారత క్రికెటర్లను ఆరాధించినప్పటికీ తన ఫేవరేట్ క్రికెటర్ మాత్రం న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అని జున్ చెప్పాడు. ఇక భారత మ్యాచ్ చూసేందుకు తాను 1200 కిలో మీటర్ల దూరం ప్రయాణించానని, ఇందుకు 1000 యూవాన్లు (భారత కరెన్సీలో రూ.11,400) ఖర్చు అయినట్లు తెలిపాడు. కాగా.. జున్ యు ఫ్లకార్డు పట్టుకుని మైదానంలో ఉన్న ఫోటోలు వైరల్‌గా మారగా నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
A Smriti Mandhana fan in Hangzhou, China. pic.twitter.com/eE3VOEjiQr
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 26, 2023