గేల్.. క్రికెట్ ఆడు.. ఫుట్‌బాల్ కాదు

గేల్.. క్రికెట్ ఆడు.. ఫుట్‌బాల్ కాదు

Updated On : May 28, 2020 / 3:40 PM IST

ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సింగిల్స్ కోసం కూడా ప్రయత్నించని క్రిస్ గేల్.. ఫీల్డింగ్‌లో కొంచెం కష్టపడ్డాడు. అది కూడా తనదైన శైలిలో బంతిని ఆపేందుకు ప్రయత్నించి.. అవకాశం ఉండి కూడా ఆపలేక బౌండరీకి పంపించాడు.
Also Read : నేను మగాడినే నమ్మండి… ఆస్ట్రేలియా క్రికెటర్ ఆవేదన

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఇన్నింగ్స్ 17.1వ ఓవర్‌లో పంజాబ్ స్పిన్నర్ ముజీబ్ బౌలింగ్‌ చేస్తున్నాడు. స్ట్రైకింగ్‌లో ఉన్న హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బంతిని పాయింట్ దిశగా హిట్ చేశాడు. దీంతో.. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న క్రిస్‌గేల్ బంతిని ఆపాలని తీవ్రంగా ప్రయత్నించాడు. మరో ఫీల్డర్ అర్షదీప్ సింగ్‌తో ఆ బంతిని నిలువరించేందుకు కష్టపడ్డాడు. వేగంగా బంతిని చేరుకుని ఒళ్లు వంచి చేతితో ఆపకుండా స్టైల్‌గా కాలు అడ్డుపెట్టి ఆపాలని అనుకున్నాడు. అది కాస్తా బెడిసి కొట్టి తనంతట తానే ఫోర్ బౌండరీకి ఇంకా వేగంగా వెళ్లేలా కొట్టాడు. 

గేల్ ‘ఫుట్‌బాల్’ తరహా ఫీల్డింగ్‌ చేశాడని నెటిజన్లు సెటైర్లు వేస్తుంటే, మ్యాచ్ చూస్తున్న స్టేడియంలో ప్రేక్షకులు మాత్రం ఆ ఫోర్‌కు నవ్వుకున్నారు. 212 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 45 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది.