గేల్ తో సెల్ఫీ దిగిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా?

అభిమాన క్రికెటర్ కళ్ల ఎదుట కనిపిస్తే ఏం చేస్తారు ఎగిరి గంతేస్తారు. వెంటనే దగ్గరికి వెళ్లి సెల్ఫీ అడుగుతారు. అంతేగా.. కొన్నేళ్ల తరువాత అదే క్రికెటర్ తో కలిసి అదే అభిమాని జట్టులో ఆడితే ఎలా ఉంటుంది.

  • Publish Date - April 5, 2019 / 11:49 AM IST

అభిమాన క్రికెటర్ కళ్ల ఎదుట కనిపిస్తే ఏం చేస్తారు ఎగిరి గంతేస్తారు. వెంటనే దగ్గరికి వెళ్లి సెల్ఫీ అడుగుతారు. అంతేగా.. కొన్నేళ్ల తరువాత అదే క్రికెటర్ తో కలిసి అదే అభిమాని జట్టులో ఆడితే ఎలా ఉంటుంది.

అభిమాన క్రికెటర్ కళ్ల ఎదుట కనిపిస్తే ఏం చేస్తారు ఎగిరి గంతేస్తారు. వెంటనే దగ్గరికి వెళ్లి సెల్ఫీ అడుగుతారు. అంతేగా.. కొన్నేళ్ల తరువాత అదే క్రికెటర్ తో కలిసి అదే అభిమాని జట్టులో ఆడితే ఎలా ఉంటుంది. గొప్ప ఫీలింగ్ కలుగుతుంది కదా. ఇలాంటి అనుభూతే వెస్టీండీస్ సూపర్ స్టార్ క్రిస్ గేల్ కు కలిగింది. తనతో సెల్ఫీ దిగిన కుర్రాడే తన స్థానంలో ఐపీఎల్ మ్యాచ్ లో ఆడటం చూసి ఎంతో ఆనందపడ్డాడు.

అనాటి ఫొటోకు గేల్.. తన ఇన్ స్టాగ్రామ్ లో మరో ఫొటో కలిపి షేర్ చేశాడు. ‘ ప్రతి యంగ్ స్టార్ కి ఇదొక స్పెషల్ మూమెంట్. నాకు అంతా గుర్తుంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో.. ఈరోజు ఎక్కడ ఉన్నావో.. ఈ ఫొటోలో అప్పుడు నేను ఎంతో యంగ్ గా కనిపిస్తున్నాను. కానీ, నాకుంటే నువ్వే బాగా యంగ్ లా కనిపిస్తున్నావ్ ఇప్పుడు.. ’అంటూ గేల్ పోస్టు పెట్టాడు. 
Read Also : అస్గర్ ఆఫ్ఘన్ పై వేటు.. కెప్టెన్సీ నుంచి తొలగింపు

ఆ ఫొటోల్లో క్రిస్ గేల్ పక్కన నిల్చొని స్కూల్ యూనిఫాంలో ఫొజు ఇచ్చిన కుర్రాడు ఎవరో కాదు.. ఓ ఇంగ్లీష్ క్రికెటర్. ఇంకా గుర్తుకు రాలేదా? అతడే సామ్ కరన్. అప్పటి బుడ్డోడే.. ఇప్పుడు ఐపీఎల్ 2019 సీజన్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు నుంచి బరిలో దిగాడు. ఈ ఏడాది పంజాబ్ ఫ్రాంచైజీ 20ఏళ్ల సామ్ కరన్ ను రూ.7.20 కోట్లతో కొనుగోలు చేసింది. ఐపీఎల్ ఆరంభంలోనే కరన్ అద్భుతమైన ప్రదర్శనతో మెప్పించాడు. ఆడిన రెండు మ్యాచ్ ల్లోనే జట్టులో కరన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు.

మొహాలీలో ఢిల్లీ కేపిటల్స్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో కరన్ 14 పరుగులతో హాట్రిక్ విజయాన్ని అందించి ఈ సీజన్ తొలి క్రికెటర్ గా నిలిచాడు.  ఈ మ్యాచ్ లో తన అభిమాన హీరో గేల్ స్థానంలో పంజాబ్ తరపున కరన్ చోటు దక్కించుకున్నాడు.