Chris Gayle : టీ20 లెజెండ్ క్రిస్ గేల్.. విల్ బి బ్యాక్.. ఐపీఎల్‌లో రీఎంట్రీ..!
Chris Gayle : ఐపీఎల్ అతడికి కొట్టిన పిండి.. క్రీజులోకి దిగితే విధ్వంసమే.. బ్యాట్ ఝళిపిస్తే సెంచరీలే.. యూనివర్సల్ బాస్ అతడే.. కరీబియన్ విధ్వంసకర యోధుడు క్రిస్ గేల్..

Chris Gayle Starts Training, Hints At Returning In The Ipl In 2023
Chris Gayle : ఐపీఎల్ అతడికి కొట్టిన పిండి.. క్రీజులోకి దిగితే విధ్వంసమే.. బ్యాట్ ఝళిపిస్తే సెంచరీలే.. యూనివర్సల్ బాస్ అతడే.. కరీబియన్ విధ్వంసకర యోధుడు క్రిస్ గేల్.. ఐపీఎల్ లో గేల్ ఉంటే ఆ సందడే వేరు.. అయితే ఈసారి ఐపీఎల్‌లో ఆ సందడి లేదు.. క్రిస్ గేల్ ఈ ఏడాది ఐపీఎల్ 2022కి దూరంగా ఉన్నాడు. కానీ, తన అభిమానులను అలరించేందుకు వచ్చే ఐపీఎల్ కు రెడీ అంటున్నాడు.
ఇప్పుడే ట్రైనింగ్ తీసుకుంటున్నాడట.. ఐపీఎల్ 2023 నాటి ఐపీఎల్ రీఇంట్రీ ఖాయం అంటున్నాడు. గేల్ తన ఇన్ స్టా అకౌంట్లో పెట్టిన పోస్టు చూస్తుంటే.. అది నిజమే అనిపిస్తోంది. వర్క్ జస్ట్.. స్టార్ట్.. లెట్స్ గో అంటూ క్యాప్షన్ పెట్టాడు.. వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం ప్రిపరేషన్స్ బిగిన్ అంటూ తన వర్కౌట్ చేస్తున్న వీడియోను గేల్ పోస్టు చేశాడు.

Chris Gayle Starts Training, Hints At Returning In The Ipl In 2023
ఈ పోస్టును చూడగానే గేల్ అభిమానులంతా ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. బాస్ విల్ బి బ్యాక్ అంటూ సంతోషపడుతున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ కు గేల్ దూరంగా ఉండటానికి కారణం.. అతడి ఫామ్ లేమి, వయో భారం ఒక కారణంగా చెప్పవచ్చు.. అందుకే 2022 మెగా వేలంలో గేల్ పేరును నమోదు చేసుకోలేదు.
— Addicric (@addicric) March 29, 2022
ఇదివరకే గేల్ టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పేస్తాడంటూ ప్రచారం జరిగింది. ఏదిఏమైనా.. గేల్ మళ్లీ ఐపీఎల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడనే హింట్ ఇవ్వగానే అభిమానుల్లో ఆనందానికి అవధుల్లేవు.. గేల్ తన ఐపీఎల్ కెరీర్‌లో 142 మ్యాచ్ లు ఆడగా.. అందులో 6 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు. అందులో 405 ఫోర్లు, 357 సిక్సులతో కలిపి మొత్తంగా 4965 పరుగులు తన పేరిట నమోదు చేశాడు.
Read Also : IPL2022 RR Vs SRH : తీరు మారని హైదరాబాద్.. రాజస్తాన్ చేతిలో చిత్తు