ODI World Cup-2023: భారత్-పాక్ మ్యాచ్ వేడి వేళ.. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఆల్ రౌండర్ కీలక వ్యాఖ్యలు

తన బౌలింగ్ ను మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉందని వోక్స్ అన్నాడు. ఆదివారం ఢిల్లీలో..

ODI World Cup-2023: భారత్-పాక్ మ్యాచ్ వేడి వేళ.. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఆల్ రౌండర్ కీలక వ్యాఖ్యలు

Chris Woakes

Updated On : October 13, 2023 / 3:53 PM IST

Chris Woakes: భారత్-పాక్ మ్యాచ్ వేడి వేళ.. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో తాము గెలవడం కష్టతరమని, భారత ఉప ఖండ దేశాల జట్ల (పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్)కు మాత్రం ఇక్కడి వాతావరణం అలవాటేనని చెప్పారు.

భారత్ లో జరుగుతున్న ప్రపంచ కప్-2023లో ఇంగ్లండ్ తొలి మ్యాచులో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోగా, బంగ్లాదేశ్ పై గెలిచింది. టీమిండియాతో అహ్మదాబాద్ లో పాకిస్థాన్‌ శనివారం, లఖ్‌నవూలో ఇంగ్లండ్ ఈ నెల 29న తలపడతాయి. గత ప్రపంచ కప్ ను గెలుచుకున్న ఇంగ్లండ్ జట్టులో వోక్స్ కూడా ఉన్నాడు.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. టీమిండియాను భారత గడ్డపై ఓడించడం తమకు చాలా క్లిష్టతరమని, అయినప్పటికీ గట్టిపోటీనివ్వడానికి తగిన స్క్వాడ్, ప్లేయర్లు ఇప్పుడు ఉన్నారని చెప్పాడు. సమర్థంగానే ఆడతామని భావిస్తున్నట్లు తెలిపాడు. ప్రేక్షకులకు తమపై ఎన్నో అంచనాలు ఉన్నాయని చెప్పాడు.

అలాగే, తమపై తమకు కూడా కొన్ని అంచనాలు ఉంటాయని తెలిపాడు. తన బౌలింగ్ ను మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉందని వోక్స్ అన్నాడు. ఆదివారం ఢిల్లీలో అఫ్గానిస్థాన్ తో ఇంగ్లండ్ ఆడనుంది. ఇటీవలే బంగ్లాపై ఇంగ్లండ్ 137 పరుగుల తేడాతో గెలిచింది.

ప్రస్తుతం టీమిండియా అహ్మదాబాద్‌లో ఉంది..

World Cup 2023 BAN vs NZ ODI: బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్