Jaydev Unadkat : యానిమల్ మూవీ ఓ బిగెస్ట్ డిజాస్టర్.. మూడు గంటలు టైమ్ వేస్ట్.. టీమ్ఇండియా క్రికెటర్ కామెంట్స్..!
Jaydev Unadkat-Animal : టాలీవుడ్ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటించిన సినిమా యానిమల్.

Jaydev Unadkat-Animal
టాలీవుడ్ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటించిన సినిమా యానిమల్. రష్మిక మందన్న, తృప్తి దిమ్రీ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వసూళ్లలలో దుమ్మురేపుతోంది. ఈ చిత్రం పై కొందరు ప్రశంసల జల్లు కురిపిస్తుండగా మరికొందరు ఈ చిత్రంలో హింస ఎక్కువగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.
ఈ సినిమా ఓ బిగెస్ట్ డిజాస్టర్ అని, మూడు గంటల టైమ్ వేస్ట్ అంటూ టీమ్ఇండియా పేసర్ జయదేవ్ ఉన్కదత్ అన్నాడు. సినిమా వాళ్లకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలంటూ సోషల్ మీడియాలో తెలిపాడు. ఉన్కదత్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Rohit Sharma : భార్య, కూతురితో స్వదేశానికి చేరుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్
‘యానిమల్ సినిమా ఓ డిజాస్టర్. మనం అడవుల్లో నివసించడం లేదు. యుద్దాలు చేస్తూ వేటాడే సమాజంలో బ్రతకం లేదు. నటన ఎంత గొప్పగా ఉన్నా కూడా మితిమీరిన వయోలెన్స్ ఉండడం మంచికాదు. ఇలాంటి వాటిని ఆదిరించి ప్రశంసలు కురిపించడం బాధాకరం. లక్షలాది మంది సినిమాలు చూస్తారు. సినిమా వాళ్లకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఈ సినిమా చూడడం వల్ల మూడు గంటల సమయం వృధా అయ్యింది.’ అని ఎక్స్‌లో జయదేవ్ ఉన్కదత్ పోస్ట్ చేశాడు. అయితే.. కొద్ది సేపటి తరువాత దాన్ని తొలగించాడు. కాగా.. అప్పటికే దీన్ని పలువురు నెటీజన్లు స్ర్కీన్ షాట్లు తీసి పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ. 201.53 కోట్లు వసూలు చేసింది. హిందీ వెర్షన్ గరిష్టంగా రూ.176.58 కోట్ల వసూళ్లు సాధించింది. తెలుగు వెర్షన్ రూ.23.15 కోట్లు సంపాదించింది.
IND vs SA : టీమ్ఇండియాతో సిరీస్.. కెప్టెన్‌కు షాకిచ్చిన దక్షిణాఫ్రికా.. పెద్ద ప్లానే..!
ఇక ఉనద్కత్ విషయానికి వస్తే.. టీమ్ఇండియా తరుపున నాలుగు టెస్టులు, ఎనిమిది వన్డేల్లు, పది టీ20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో మూడు, వన్డేల్లో తొమ్మిది, టీ20ల్లో 14 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్‌లో 94 మ్యాచులు ఆడిన ఈ పేసర్ 91 వికెట్లు పడగొట్టాడు.