ప్రపంచంలోనే ఖరీదైన కారు కొన్న క్రిస్టియానో ​​రొనాల్డో.. ధర ఎంతంటే?

  • Publish Date - August 4, 2020 / 12:34 PM IST

ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకరైన పోర్చుగల్ ఫుట్​బాల్ ప్లేయర్​, జువెంటస్​ స్టార్​ క్రిస్టియానో ​​రొనాల్డో ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లలో ఒకదాన్ని కొనుగోలు చేశాడు. రొనాల్డో బుగట్టి సెంటోడియాక్ కారును కొన్నారు. ఇది చాలా పరిమిత సంఖ్యలో లభిస్తుంది.



ఈ కారు ధర సుమారు రూ. 75 కోట్లు(8.5 మిలియన్ యూరోలు). రొనాల్డో తన కొత్త కారుతో ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. రొనాల్డో ఇటీవల సిరీస్‌ ఎ ఛాంపియన్‌షిప్‌లో ఇటలీ దిగ్గజ క్లబ్‌ జువెంటస్‌‌ను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించారు.

లా వాచ్యూర్‌ ఎన్వైర్ మోడల్​లో ‘బుగాటీ’ 10 కార్లను మాత్రమే ప్రత్యేకంగా తయారు చేసింది. రొనాల్డో తనకు కావాల్సిన విధంగా ఈ కారును డిజైన్​ చేయించుకున్నాడు. ఈ కారు గంటకు 380 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఇక కేవలం 2.4 సెకన్లలోనే 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోలగదు.



రొనాల్డో గ్యారేజ్‌లో ఇప్పటికే దాదాపు 30 మిలియన్‌ యూరోలు (రూ. 264 కోట్లు) విలువ చేసే కార్లు ఉన్నాయి. 35ఏళ్ల క్రిస్టియానో మొత్తం రూ. 788 కోట్లతో ఈ ఏడాది అత్యధిక ఆర్జన కలిగిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. ఇటీవలే అతడు రూ. 53 కోట్లతో అత్యంత అధునాతన విహార నౌకను కూడా కొనుగోలు చేశాడు.