MI vs CSK(Probable Playing XI): ఐపీఎల్‌లో ఆసక్తికరపోరు.. జట్ల అంచనా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 14వ సీజన్ సెకండాఫ్‌లో మిగిలిన మ్యాచ్‌లు ఇవాళ(సెప్టెంబర్ 19వ తేదీ) ప్రారంభం అవుతున్నాయి.

Mi Csk
MI vs CSK Probable Playing XI: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 14వ సీజన్ సెకండాఫ్‌లో మిగిలిన మ్యాచ్‌లు ఇవాళ(సెప్టెంబర్ 19వ తేదీ) ప్రారంభం అవుతున్నాయి. ఐపీఎల్-2021 సెకండాఫ్ మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతుండగా.. ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన చివరి 5 మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్ 4 మ్యాచ్‌లు గెలిచింది. ఈ శక్తివంతమైన మ్యాచ్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ మరియు ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడే ప్లేయింగ్ XI ఎవరో తెలుసుకోండి..
ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే, జట్టులోని ఆటగాళ్లందరూ అందుబాటులోనే ఉన్నారు. జట్టుతో చివరిగా వచ్చిన కీరాన్ పొలార్డ్ కూడా మొదటి మ్యాచ్‌కు అందుబాటులో ఉన్నాడు. మరోవైపు, చెన్నై సూపర్ కింగ్స్ తరుపున మాత్రం కొందరు అందుబాటులో లేరు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నందున మ్యాచ్‌లో సామ్ కర్రాన్ అందుబాటులో లేరు. అదే సమయంలో, గాయం నుంచి కోలుకొని CSK ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్ అందుబాటులోకి వచ్చాడు. ప్రాక్టీస్ కూడా చేశాడు.
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్‌లో క్వింటన్ డి కాక్, కీరాన్ పొలార్డ్ మరియు ట్రెంట్ బౌల్ట్ విదేశీ ఆటగాళ్లుగా కచ్చితంగా ఉండవచ్చు. ప్లేయింగ్ ఎలెవన్‌లో చేరే మరో వ్యక్తి కోసం ఎదరుచూస్తుంది. ఆడమ్ మిల్నే మరియు నాథన్ కౌల్టర్-నైల్‌లలో ఒకరికి అవకాశం ఉంటుంది.
ముంబై ఇండియన్స్ Probable Playing XI:
క్వింటన్ డి కాక్(wk), రోహిత్ శర్మ(c), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కిరాన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, ఆడమ్ మిల్నే/నాథన్ కౌల్టర్-నైల్, జస్ప్రిత్ బుమ్రా మరియు ట్రెంట్ బౌల్ట్.
చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే, ఫాఫ్ డు ప్లెసిస్ ఫిట్‌గా ఉండగా.. రాబిన్ ఉతప్ప ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటుకోసం చూస్తున్నారు. అదే సమయంలో, సామ్ కర్రన్ స్థానంలో డ్వేన్ బ్రావోకు అవకాశం లభించవచ్చు. లుంగి ఎన్‌గిడి ఫాస్ట్ బౌలర్‌గా జట్టులో ఉంటాడు. మొయిన్ అలీ కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండవచ్చు. నలుగురు విదేశీ ఆటగాళ్ల విషయానికి వస్తే, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, బ్రావో మరియు ఎన్గిడి ఉన్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ Probable Playing XI:
రితురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మోయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, MS ధోనీ(C&WK), డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, లుంగీ ఎన్గిడి మరియు దీపక్ చాహర్.
మ్యాచ్ వివరాలు:
చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్, మ్యాచ్-30
వేదిక: దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, దుబాయ్
తేదీ & సమయం: సెప్టెంబర్ 19 వ తేదీ సాయంత్రం 7:30 IST
ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ మరియు డిస్నీ+హాట్‌స్టార్