CSK vs MI: చెన్నై చేతిలో ముంబైకి మూడో ఓటమి??

సొంతగడ్డపై ధోనీ సేనను చిత్తు చేయాలని భావిస్తున్న ముంబై ఇండియన్స్ కు మూడో ఓటమి తప్పేటట్టు లేదు. హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకుని లీగ్ లో టాప్ స్థానంలో దూసుకెళ్తోన్న సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో ఫేవరేట్ గా కనిపిస్తోంది.
తొలి మ్యాచ్‌లో ఓటమిరాయుళ్లు బెంగళూరుపై విజయం దక్కించుకుని తర్వాతి 2 మ్యాచ్‌లలోనూ పరాజయం పాలైంది. అలాంటి ముంబై… బలాబలాలను చక్కగా సద్వినియోగం చేసుకుంటోన్న చెన్నై సూపర్ కింగ్స్ మీద గెలవడం కష్టమే.
రోహిత్ తో పాటు యువరాజ్ సింగ్, హార్దిక్ పాండ్యాల మెరుపులు సరిపోవడం లేదు. గత మ్యాచ్‌లో ముంబై ఓ మాదిరి స్కోరు మాత్రమే నమోదు చేశారు. దీంతో ఆ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అద్భుతంగా గెలిచింది.