IND vs AUS Test Series: ఆసీస్ జట్టుకు మరోషాక్.. టెస్ట్ సిరీస్ నుంచి డేవిడ్ వార్నర్ ఔట్ ..

ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డేవిడ్ వార్నర్‌కు గాయమైంది. సిరాజ్ బౌలింగ్‌లో బంతి తగడంతో వార్నర్ మోచేతికి స్వల్పంగా గాయం అయింది. దీంతో ఇన్నింగ్స్‌లో ఔట్ అయిన తరువాత వార్నర్ మళ్లీ మైదానంలోకి రాలేదు.

IND vs AUS Test Series: ఆసీస్ జట్టుకు మరోషాక్.. టెస్ట్ సిరీస్ నుంచి డేవిడ్ వార్నర్ ఔట్ ..

david warner

Updated On : February 21, 2023 / 3:03 PM IST

IND vs AUS Test Series: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ ఇండియాలో జరుగుతుంది. ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్ లు పూర్తయ్యాయి. రెండు టెస్టుల్లోనూ భారత్ విజయం సాధించి 2-0 ఆధిక్యంలో ఉంది. మరో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే, ఈ రెండు టెస్టు మ్యాచ్‌లకు ఆసీస్ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) దూరమయ్యాడు. ఆయన రెండో టెస్టు పూర్తయిన అనంతరం స్వదేశానికి వెళ్లాడు. గాయం కారణంగా అతను రాబోయే రెండు టెస్టులకు ఆడటం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ధృవీకరించింది.

IND vs AUS Test Match: ఆసీస్‌కు మరో ఎదురుదెబ్బ.. ఉన్నపళంగా స్వదేశానికి కెప్టెన్ పాట్ కమిన్స్ ..

ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డేవిడ్ వార్నర్‌కు గాయమైంది. సిరాజ్ బౌలింగ్‌లో బంతి వార్నర్‌కు తగిలింది. దీంతో వార్నర్ మోచేతికి స్వల్పంగా గాయం అయింది. దీంతో ఇన్నింగ్స్‌లో ఔట్ అయిన తరువాత వార్నర్ మళ్లీ మైదానంలోకి రాలేదు. అతని స్థానంలో మాట్ రెన్‌షాను ఆ మ్యాచ్‌లో ఆడించారు. అయితే డేవిడ్ వార్నర్ ఇంకా ఫిట్ కాకపోవటంతో టెస్టు సిరీస్ నుంచి పూర్తిగా తప్పిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. టెస్ట్ సిరీస్ తర్వాత జరిగే మూడు వన్డేల కోసం అతను భారత్ కు తిరిగి వస్తాడని సమాచారం. అప్పటి వరకు వార్నర్ గాయం నయం అయ్యి ఫిట్‌నెస్ సాధిస్తే వన్డే జట్టులోకి వస్తాడని ఆసీస్ జట్టు పేర్కొంది.

Ind Vs Aus 2nd Test: బెడిసికొట్టిన ఆసీస్ ప్లాన్.. ఆ రెండు షాట్లు కొంపముంచాయి ..

ఇండియాతో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌లలోనూ డేవిడ్ వార్నర్ పెద్దగా రాణించలేదు. ఓపెనర్ గా బరిలోకి దిగిన వార్నర్ మూడు ఇన్నింగ్స్ ఆడాడు. మూడు ఇన్నింగ్స్ లో కూడా ఆశించిన స్థాయిలో భారీ పరుగులు సాధించడంలో విఫలమయ్యాడు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టును గాయాల బెడద వేధిస్తోంది. వరుస ఓటములతో ఆందోళనలో ఉన్న ఆ జట్టుల్లోని పలువురు ప్లేయర్లు గాయపడ్డారు. మూడో టెస్ట్ మ్యాచ్ మార్చి 1న ఇండోర్ వేదికగా ప్రారంభమవుతుంది.