DCvsRCB: ఢిల్లీ ధూం దాం..బెంగళూరుకు ఆరో ఓటమి..

DCvsRCB: ఢిల్లీ ధూం దాం..బెంగళూరుకు ఆరో ఓటమి..

Updated On : April 7, 2019 / 1:43 PM IST

సొంతగడ్డపై చేసిన మరో ప్రయత్నంలోనూ బెంగళూరుకు ఓటమి తప్పలేదు. ఢిల్లీ చేతిలో 4 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. టాస్ గెలిచి బెంగళూరుకు బ్యాటింగ్ అప్పగించిన ఢిల్లీ వార్ వన్ సైడ్ చేసేసింది. 150 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన ఢిల్లీ ఆరంభం నుంచి దూకుడు కనబరిచింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(67; 50 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులు) అద్భుతమైన ఇన్నింగ్స్ జట్టుకు హైలెట్ గా నిలిచింది. 

ఓపెనర్ గా దిగిన ధావన్(0) నిరాశపరచగా, మరో ఓపెనర్ పృథ్వీ షా(28) ధాటిగా ఆడి మెప్పించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన శ్రేయాస్ తో కలిసి కొలిన్ ఇన్ గ్రామ్(22) తో కలిసి జట్టుకు సహకారాన్ని అందించాడు. రిషబ్ పంత్(18) చేయగా క్రిస్ మోరిస్(0), అక్సర్ పటేల్(4), రాహుల్ తెవాటియా(1) తో జట్టుకు విజయాన్ని అందించారు. 

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్లు నష్టపోయి ఢిల్లీ క్యాపిటల్స్ కు 150 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ప్రతి మ్యాచ్ గెలవాల్సిన ఆర్సీబీ స్వల్ప టార్గెటే ఉంచడం ఢిల్లీకి చేధన సులువయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరోసారి బెంగళూరు బ్యాట్స్ మెన్ అతి తక్కువ వ్యక్తిగత స్కోరుకే వికెట్లు చేజార్చుకున్నారు. సిరాజ్ ఒక్క వికెట్ ఎల్బీ డబ్ల్యూగా అవుట్ అవగా మిగిలినవారంతా క్యాచ్ అవుట్ లే అయ్యారు. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి టిమ్ సౌథీ, చాహల్ క్రీజులో ఉన్నారు.

ఓపెనర్లు పార్థివ్ పటేల్(9), విరాట్ కోహ్లీ(41) చేయగా..  డివిలియర్స్(17), మార్కస్ స్టోనిస్(15), మొయిన్ అలీ(32), అక్షదీప్ నాథ్(19), పవన్ నేగీ(0), టిమ్ సౌథీ(9), సిరాజ్(1), చాహల్(1) పరుగులు చేయగలిగారు.