Asian Games 2023 : ఆసియా క్రీడల నుంచి తప్పుకున్న డిఫెండింగ్ ఛాంపియన్.. కారణమదే..?
ఆసియా క్రీడలకు (Asian Games) ముందు భారత్‌కు షాక్ తగిలింది. డిఫెండింగ్ చాంపియన్, స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ (Vinesh Phogat) ఈ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించింది.
Asian Games : ఆసియా క్రీడలకు (Asian Games) ముందు భారత్‌కు షాక్ తగిలింది. డిఫెండింగ్ ఛాంపియన్, స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ (Vinesh Phogat) ఈ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. మోకాలి గాయం (Knee Injury) కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. తనకు బదులుగా ఆసియా క్రీడలకు స్టాండ్ బై ప్లేయర్లను పంపాల్సిందిగా ఇప్పటికే అధికారులకు తెలియజేసినట్లు చెప్పింది.
Virat Kohli : ఈ రోజు నాకు వ్యక్తిగతంగా కూడా ఎంతో ప్రత్యేకం.. చిన్నప్పుడు ఏం చేసేవాడినంటే..?
“అందరికీ నమస్కారం..! నేను చాలా విచారకరమైన వార్తను పంచుకోవాలనుకున్నాను. రెండు రోజుల క్రితం 13 ఆగస్టు 2023 న శిక్షణలో నా ఎడమ మోకాలికి గాయమైంది. స్కాన్లు, పరీక్షలు చేసిన తరువాత గాయం నుంచి కోలుకునేందుకు శస్త్రచికిత్స ఒక్కటే మార్గం అని వైద్యులు చెప్పారు. దీంతో ఆగస్టు 17న ముంబైలో శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నా. 2018లో జకార్తా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సాధించాను. అయితే.. గాయం కారణంగా ఈ సారి టోర్నీలో పాల్గొనలేకపోతున్నాను. ఇప్పటికే ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశాను. నాకు బదులుగా రిజర్వ్ ప్లేయర్‌ను ఆసియా క్రీడలకు పంపవచ్చు. అభిమానులు మద్దతు ఇప్పుడు నాకు చాలా అవసరం. అప్పుడే నేను బలంగా తిరిగి వచ్చి 2024లో పారిస్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌కు సిద్ధం కాగలను. మీ అందరి మద్దతు నాకు కొండంత బలాన్ని ఇస్తుంది.” అంటూ ఓ లేఖను సోషల్ మీడియాలో వినేశ్ ఫొగట్ పంచుకుంది.
కాగా డబ్ల్యూఎఫ్ఐ.. ఆసియా క్రీడల ట్రయల్స్ నుంచి రెజ్లర్లు బజ్‌రంగ్ పునియా, వినేశ్ ఫొగట్‌లకు మినహాయింపు ఇచ్చి నేరుగా ప్రవేశం కల్పించింది. ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. దీనిని సవాల్ చేస్తూ రెజ్లర్లు అంతిమ్ పంగాల్, సుజీత్ కల్కల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా అక్కడ వారికి చుక్కెదురు అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వినేశ్ ఫోగట్ తప్పుకోవడంతో ఆమె స్థానంలో అంతిమ్ పంగాల్ ఆసియా క్రీడలకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. ఆమె ట్రయల్స్‌లో గెలిచి ఆసియా క్రీడలకు స్టాండ్ బైగా ఎంపికైంది.
— Vinesh Phogat (@Phogat_Vinesh) August 15, 2023
Team India : వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఓటమి.. భారత్ ఖాతాలో చేరిన చెత్త రికార్డులు ఇవే..