GT vs DC : అహ్మ‌దాబాద్‌లో గుజ‌రాత్ పై ఢిల్లీ ఘ‌న విజ‌యం..

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది.

GT vs DC : అహ్మ‌దాబాద్‌లో గుజ‌రాత్ పై ఢిల్లీ ఘ‌న విజ‌యం..

Pic Credit @IPL Twitter

Gujarat Titans vs Delhi Capitals : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. బుధవారం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. 90 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని8.5 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ (20; 10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), రిష‌బ్ పంత్ (16 నాటౌట్; 11 బంతుల్లో 1ఫోర్‌, 1సిక్స్‌), షై హోప్ (19; 10 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స‌ర్లు) అభిషేక్ పోరెల్ (15; 7 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్‌) లు రాణించారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో సందీప్ వారియర్ రెండు వికెట్లు, స్పెన్సర్ జాన్సన్, ర‌షీద్ ఖాన్ లు చెరో ఓ వికెట్ తీశారు. ఈ సీజ‌న్‌లో ఢిల్లీకి ఇది మూడో విజ‌యం. ఆరు పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో ఆరో స్థానానికి చేరుకుంది.

అంత‌క‌ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ జ‌ట్టు ఢిల్లీ బౌల‌ర్ల ధాటికి 17.3 ఓవ‌ర్ల‌లో 89 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజ‌రాత్‌కు ఏదీ క‌లిసి రాలేదు. రెండో ఓవ‌ర్‌లోనే ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ (8) ను ఇషాంత్ శ‌ర్మ.. నాలుగో ఓవ‌ర్‌లో ఐదో బంతికి మ‌రో ఓపెన‌ర్ వృద్ధిమాన్ సాహా (2) ను ముకేశ్ కుమార్ లు ఔట్ చేశారు. సాయి సుద‌ర్శ‌న్ (12), డేవిడ్ మిల్ల‌ర్ (2)లు కూడా ఎక్కువ సేపు నిల‌వ‌లేదు.

MS Dhoni : ధోని ఐపీఎల్ 2025 సీజ‌న్ ఆడతాడా..? ఒక్క ముక్క‌లో చెప్పేసిన సురేశ్ రైనా

అభినవ్‌ మనోహర్‌ (8), షారుక్‌ ఖాన్ (0) లు ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయారు. దీంతో 48 ప‌రుగుల‌కే ఆరు వికెట్లు కోల్పోయి గుజ‌రాత్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో ర‌షీద్ ఖాన్ (31; 24 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్స్‌), రాహుల్ తెవాటియా (10) లు కాసేపు వికెట్ల ప‌త‌నాన్ని అడ్డుకున్నాడు. తెవాటియా ను అక్ష‌ర్ ప‌టేల్ ఎల్బీగా ఔట్ చేశాడు.

కాసేప‌టికే ర‌షీద్ ఖాన్ కూడా పెవిలియ‌న్‌కు చేరుకోవ‌డంతో గుజ‌రాత్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సేపు ప‌ట్ట‌లేదు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో ముకేశ్ కుమార్ మూడు వికెట్లు తీశాడు. ఇషాంత్ శ‌ర్మ‌, ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. అక్ష‌ర్ ప‌టేల్‌, ఖ‌లీల్ అహ్మ‌ద్ చెరో వికెట్ సాధించారు.

Kris Srikkanth : ఆర్‌సీబీ గెల‌వాలంటే.. 11 మంది బ్యాట‌ర్ల‌తో బ‌రిలోకి.. కోహ్లి బౌలింగ్