Prithvi Shaw : ముంబైలో సొంతింటి కలను నెరవేర్చుకున్న పృథ్వీ షా.. లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు.. ధర ఎంతంటే?
టీమ్ఇండియా ఆటగాడు పృథ్వీ షా తన సొంతింటి కలను నెరవేర్చుకున్నాడు.

Delhi Capitals player Prithvi Shaw buys new house in Mumbai
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ముంబైలాంటి మహానగరంలో సొంతిల్లు కొనడం అంటే మామూలు విషయం కాదు. టీమ్ఇండియా ఆటగాడు పృథ్వీ షా తన సొంతింటి కలను నెరవేర్చుకున్నాడు. అదీ కూడా ముంబై మహానగరంలో. సంపన్నులు ఎక్కువగా నివసించే బాంద్రాలో. ఈ విషయాన్ని స్వయంగా అతడే సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
నా సొంతింటి కలను సాకారం చేసుకున్నాను. ఎంతో ఆనందంగా ఉంది. విలాసవంతంగా ఉంది. ఇంటీరియర్ డిజైన్ అద్భుతంగా ఉంది. అంటూ రాసుకొచ్చాడు. ఇంటికి సంబంధించిన పలు ఫోటోలను సైతం షేర్ చేశాడు. ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. కాగా.. ఎంత పెట్టి కొన్నాడు అనే విషయం మాత్రం చెప్పలేదు. కాగా.. రూ.16 కోట్లకు పైగా వెచ్చించినట్లు తెలుస్తోంది.
వన్డే ప్రపంచకప్ 2027కు వేదికలు ఖరారు.. దక్షిణాఫ్రికాలో 8 స్టేడియాల్లో మ్యాచులు
ఐపీఎల్‌లో పృథ్వీ షా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో పేలవ ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోయిన పృథ్వీ షా ఐపీఎల్‌లో 17వ సీజన్‌లో తొలి రెండు మ్యాచుల్లో చోటు దక్కలేదు. చెన్నైతో మ్యాచ్‌లో బరిలోకి దిగి 27 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై పై ఢిల్లీ 20 పరుగుల తేడాతో గెలిచింది. ఆ తరువాత ముంబై మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 66 పరుగులు చేశాడు.
View this post on Instagram