యాడ్‌లో సాక్షితో ధోనీ: మహీ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడట

యాడ్‌లో సాక్షితో ధోనీ: మహీ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడట

Updated On : February 28, 2019 / 1:38 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే మనిషి మాత్రమే కాదు ఓ బ్రాండ్.. ఓ శక్తి. ఏ యాడ్ తీసినా అందులో వైవిధ్యం. పంచె కట్టినా, కబడ్డీ కూత పెట్టినా, తలాను పొగడని మనిషి అంటూ ఉండరు. ధోనీ కూడా ఎప్పటికప్పుడు కొత్త లుక్‌తో కనిపిస్తూ అలరిస్తూనే ఉంటాడు. టీవీలో ఏ యాడ్ వచ్చినా వెంటనే చానెల్ మార్చేసే వీక్షకులు ధోనీ యాడ్ వస్తే మాత్రం టీవీలకు అతుక్కుపోతుంటారు. కారణం.. అతనికున్న క్రేజ్..
Read Also : రికార్డుల వర్షం: ఒకే మ్యాచ్‌లో గేల్ సృష్టించిన అద్భుతాలు

ఇన్నాళ్లూ యాడ్‌లలో ఒక్కడే కనిపించిన ధోనీ.. ఇప్పుడు సతీసమేతంగా ఓ కమర్షియల్ యాడ్‌లో కనిపించనున్నాడు. ఓ టూత్ పేస్ట్ యాడ్‌లో వీరిద్దరూ కలిసి నటించనున్నారట. షూటింగ్ లో ఉండగానే పబ్లిసిటీ వచ్చేయడంతో మీడియా ప్రతినిధులు అక్కడ వాలిపోయారు. ఇద్దరినీ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. 2015 ప్రపంచ కప్ జరుగుతున్న సమయంలో కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితిలో తనకు తప్పలేదని ధోనీ పేర్కొన్నాడు.
Read Also : ద్రవిడ్ సలహాలే ఫామ్‌ను తెచ్చిపెట్టాయి: కేఎల్ రాహల్

‘జీవా పుట్టినప్పుడు నేనక్కడలేను. అప్పుడు 2015 వరల్డ్ కప్ జరుగుతుంది. కెప్టెన్‌గా ఉన్న నేను కచ్చితంగా టీమ్‌తో ఉండాల్సిన పరిస్థితి. ఒకసారి సాక్షిని చూసి నవ్వాను. మ్యాచ్ కోసం బయల్దేరాను’ అని మహీ చెప్పుకొచ్చాడు. సాక్షి మాట్లాడుతూ.. ‘మహీ అంటే అంతే ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు’ అని చెప్పింది. 

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో భారత్ ఐదు వన్డేల సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా శనివారం హైదరాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియాల మధ్య మ్యాచ్ జరగనుంది. టీ20ల్లో, వన్డేల్లో చోటు దక్కించుకున్న ధోనీ జట్టుతో కలసి ప్రాక్టీస్ క్యాంపులో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. 
Read Also : బీసీసీఐ వార్నింగ్ : ఐపీఎలా.. పీఎస్ఎలా.. ఏదో ఒకటి తేల్చుకోండి