సిడ్నీ వన్డే: ధోని హాఫ్ సెంచరీ, ఆ వెంటనే ఔట్

  • Published By: veegamteam ,Published On : January 12, 2019 / 09:07 AM IST
సిడ్నీ వన్డే: ధోని హాఫ్ సెంచరీ, ఆ వెంటనే ఔట్

సిడ్నీ : ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హాఫ్ సెంచరీతో రాణించాడు. 93 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. అయితే హాఫ్ సెంచరీ చేసిన ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ఆ వెంటనే ధోని ఔట్ అయ్యాడు. ఎల్బీ డబ్ల్యూగా వెనుదిరిగాడు. 33 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి టీమిండియా 143 పరుగులు చేసింది. మరో ఎండ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 62 బంతుల్లో 2 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 50 పరుగులు పూర్తి చేశాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 288 రన్స్ చేసిన సంగతి తెలిసిందే. 289 రన్స్‌తో బరిలోకి దిగిన కోహ్లి సేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టాప్ ఆర్డర్ విఫలమైంది. ధావన్, అంబటి రాయుడు డకౌట్ అయ్యారు. విరాట్ కోహ్లి 3 పరుగులకే ఔటయ్యాడు.