MI vs CKS : ధోని రివ్య్వూ సిస్టమ్ పాడైందా?.. సోషల్ మీడియాలో వైరల్..
వికెట్ కీపింగ్‌లో ఇప్పటికి ధోనిని మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదేమో.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మరో ఓటమిని మూటగట్టుకుంది. ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పలు అవకాశాలను చేజార్చుకుంది. లక్ష్య ఛేదనలో తొలి ఓవర్‌లోనే ముంబై ఓపెనర్ బ్యాటర్ ను ఔట్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా ఎంఎస్ ధోనిని విమర్శిస్తున్నారు.
ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం అతడు బ్యాటింగ్‌లో అలరించలేకపోతున్నా కూడా వికెట్ కీపింగ్‌లో ఇప్పటికి అతడిని మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఈ సీజన్‌లో కూడా మెరుపు స్టంపౌంట్లు, రనౌట్‌లతో తనదైన ముద్ర వేశాడు.
ఇక డీఆర్ఎస్ తీసుకోవడంలో ధోనిని మించిన వాడు లేడని అంటుంటారు. అతడు డీఆర్ఎస్ తీసుకున్నాడు అంటే పక్కగా ప్రత్యర్థి బ్యాటర్ ఔట్ అయినట్లేనని చెబుతుంటారు. అందుకనే డీఆర్ఎస్ (డెసిషన్ రివ్య్వూ సిస్టమ్)ను ధోని రివ్వ్యూ సిస్టమ్‌గా అభిమానులు అభివర్ణిస్తూ ఉంటారు.
అలాంటి ధోని ముంబైతో మ్యాచ్‌లో ఓ తప్పిదం చేశాడు. డీఆర్ఎస్ తీసుకోలేదు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ముంబై బరిలోకి దిగింది. తొలి ఓవర్‌ను ఖలీల్ అహ్మద్ వేశాడు. ఈ ఓవర్‌లోని ఐదో బంతి ముంబై ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ ప్యాడ్లను తాకింది. బౌలర్ ఖలీల్‌తో పాటు కొందరు ఫీల్డర్లు ఔట్ అంటూ హాఫ్ అప్పీల్ చేశారు. అయితే.. అంపైర్ దీనిపై ఆసక్తి చూపలేదు. ధోని కూడా డీఆర్ఎస్ తీసుకోకూడదని నిర్ణయించుకున్నాడు.
కాగా.. రిప్లేలో బంతి లెగ్ స్టంప్ తాకేదని తేలింది. బ్యాట్ ఇన్‌స్టైడ్ ఎడ్జ్ కూడా తీసుకోలేదని చూపించింది. అంటే ధోని గనుక రివ్య్వూ తీసుకుని ఉంటే చెన్నైకు తొలి ఓవర్‌లోనే వికెట్ లభించేందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అప్పటికి రికెల్టన్ 10 పరుగులు మాత్రమే చేశాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న అతడు 24 పరుగుల చేశాడు. తొలి వికెట్‌కు రోహిత్ శర్మతో కలిసి 6.4 ఓవర్లలో 63 పరుగులు జోడించాడు.
MI vs CSK : ముంబైతో ఓటమి తరువాత ధోని కామెంట్స్ వైరల్.. ఐపీఎల్ 2026 ఫైనల్ XI పైనే దృష్టి..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సీఎస్‌కే బ్యాటర్లలో రవీంద్ర జడేజా (53 నాటౌట్), శివమ్ దూబె (50) లు హాఫ్ సెంచరీలు చేశారు. అనంతరం లక్ష్యాన్ని ముంబై 15.4 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ (76 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (68 నాటౌట్) మెరుపులు మెరిపించారు.
But But But DRS stands for Dhoni Review System 😂😂. Didn’t appealed at all😵💫 pic.twitter.com/6f9yBIfsCs
— Cricket enthusiastic (@AnishShres59445) April 20, 2025
Hardik Pandya missed a review against Rasheed
MS Dhoni misses a review against Rickelton
Low quality DRS usage at display#CSKvMI #RohitSharma pic.twitter.com/fbdPdbrzrI
— Crisportsindai (@MoolChad301) April 20, 2025