MI vs CSK : ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడడంపై రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్.. ఇది నా నిర్ణయం కాదు.. కానీ..
చెన్నై పై విజయం తరువాత ముంబై స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Courtesy BCCI
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. ఆదివారం వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ చెలరేగి ఆడాడు. 45 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు,6 సిక్సర్ల సాయంతో 76 పరుగులతో అజేయంగా నిలిచి చెన్నై పై ముంబై గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. కాగా.. ఈ సీజన్‌లో రోహిత్ శర్మకు ఇదే తొలి అర్థశతకం కావడం గమనార్హం.
ముంబై విజయంలో కీలక పాత్ర పోషించడంతో రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ అవార్డు అందుకున్న తరువాత రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో రాణించడం తనకు ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. తన బ్యాటింగ్‌ను చెన్నైఫ్యాన్స్ సైతం ఆస్వాదించడం పై సంతోషాన్ని వ్యక్తం చేశాడు. వారు క్రికెట్ అభిమానులని, ఆటను ఆస్వాదిస్తారని చెప్పుకొచ్చాడు.
MI vs CSK : ముంబైతో ఓటమి తరువాత ధోని కామెంట్స్ వైరల్.. ఐపీఎల్ 2026 ఫైనల్ XI పైనే దృష్టి..
తన పేలవ ఫామ్ పై స్పందిస్తూ.. సుదీర్ఘ కాలంగా విఫలమైతే ఎవరికైనా వారి ఆటపై సందేహం కలుగుతుందన్నాడు. విభిన్నంగా ప్రయత్నించేలా చేస్తుందన్నాడు. ‘పరిస్థితులను సింపుల్‌గా ఉంచుతూ క్లియర్ మైండ్‌సెట్‌తో ఆడాలనుకున్నాను. ఎలాంటి షాట్స్ ఆడాలి? ఇన్నింగ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలన్నదానిపై ఫోకస్ పెట్టాను. నా బలాలకు తగ్గట్లు ఆడాను. నెట్స్‌లో మరింత ఎక్కువ కష్టపడ్డాను. ఎప్పుడైనా నా ఆర్క్‌లో బంతి పడితే అస్సలు వదలను.’ అని రోహిత్ తెలిపాడు.
ఇక ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగడం అనేది జట్టు నిర్ణయం అని చెప్పుకొచ్చాడు. దీనిపై చాలా సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపాడు. 17 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేయకుండా ఓ రెండు మూడు ఓవర్లు మైదానంలోకి రావడం వల్ల జట్టుకు ఒరిగేది ఏం లేదన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా రావడాన్ని తాను పట్టించుకోనన్నాడు. తాను నేరుగా వచ్చి బ్యాటింగ్ చేయాలని టీమ్ కోరుకుంటే తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నాడు.
మాట రావడం లేదు..
వాంఖడే స్టేడియంలోని ఓ స్టాండ్‌కు ముంబై క్రికెట్ అసోసియేషన్ రోహిత్ శర్మ పేరును పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై హిట్ మ్యాన్ స్పందిస్తూ.. ఈ విషయం పై తనకు ఎలా స్పందించాలో అర్థం కావడం లేదన్నాడు. కుర్రాడిగా ఉన్నప్పుడు కొన్నిసార్లు మైదానంలోకి రానిచ్చేవారు కాదన్నాడు. నా పేరిట ఓ స్టాండ్ పెట్టడం ఆ స్టాండ్ వైపు సిక్స్ కొట్టడం మాట్లలో చెప్పలేని అనుభూతి ఇచ్చిందన్నాడు. ఈ గ్రౌండ్‌లోనే ఆటగాడిగా పెరిగాను.. ఇప్పుడు నా పేరిటే ఓ స్టాండ్ పెట్టడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. అని హిట్ మ్యాన్ అన్నాడు.
Virat Kohli : విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు.. నాకు ఈ అవార్డు వొద్దు.. అసలెందుకు ఇచ్చారో తెలియదు
ఇక మ్యాచ్‌ను ముగించడం చాలా సంతృప్తినిచ్చిందన్నాడు. జట్టు సరైన సమయంలో పుంజుకుందన్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచామని, ఇలాంటి టోర్నీల్లో వరుసగా మ్యాచ్‌లు గెలవడం చాలా కీలకమన్నాడు.