Dinesh Karthik : నీ మాట‌లు న‌మ్మ‌ను.. వెన్నుపోటు పొడిచావు.. పంత్‌ను హైలైట్ చేశావు : నాజర్ హుస్సేస్ వ్యాఖ్య‌లపై దినేశ్ కార్తీక్‌

ఆర్‌సీబీ మ్యాచులు ఓడిపోతున్న‌ప్ప‌టికీ వ్య‌క్తిగ‌తంగా దినేశ్ కార్తీర్ ఫినిష‌ర్ పాత్ర‌ను చ‌క్క‌గా పోషిస్తున్నాడు.

Dinesh Karthik : నీ మాట‌లు న‌మ్మ‌ను.. వెన్నుపోటు పొడిచావు.. పంత్‌ను హైలైట్ చేశావు : నాజర్ హుస్సేస్ వ్యాఖ్య‌లపై దినేశ్ కార్తీక్‌

Dinesh Karthik hilarious dig at former England skipper Nasser Hussain

Dinesh Karthik – Nasser Hussain : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌డ‌బ‌డుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు మ్యాచులు ఆడ‌గా నాలుగు మ్యాచుల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానంలో కొన‌సాగుతోంది. ఆర్‌సీబీ మ్యాచులు ఓడిపోతున్న‌ప్ప‌టికీ వ్య‌క్తిగ‌తంగా దినేశ్ కార్తీర్ ఫినిష‌ర్ పాత్ర‌ను చ‌క్క‌గా పోషిస్తున్నాడు.

ఈ క్ర‌మంలో స్పోర్ట్స్ ఛాన‌ల్ పాడ్ కాస్ట్‌లో డికే ను అభినందించిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజ‌ర్ హుస్సేన్ రానున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టులో దినేశ్ కార్తీక్ ఉండాల‌న్నాడు. లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో అత‌డు చాలా చ‌క్క‌గా బ్యాటింగ్ చేస్తున్నాడ‌ని అన్నారు. దీనిపై కార్తీక్ స్పందించాడు. నాజ‌ర్ హుస్సేన్ వ్యాఖ్య‌ల‌ను తాను న‌మ్మ‌డం లేద‌న్నాడు. ఓ వ్య‌క్తిగా, క్రికెట‌ర్‌గా, వికెట్ కీప‌ర్‌గా అత‌డు న‌న్ను ఇష్ట‌ప‌డ‌డ‌న్న విష‌యం త‌న‌కు తెలుస‌న్నాడు.

Nitish Kumar Reddy : తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి సూపర్ బ్యాటింగ్.. పాట్ కమ్మిన్స్, హనుమ విహారి ఆసక్తికర వ్యాఖ్యలు

మొద‌టి సారి అత‌డు త‌న‌ని పొగుడుతూ మాట్లాడుతున్నాడ‌ని చెప్పాడు. గ‌త టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ముందు జ‌ట్టులోకి త‌న‌ను తీసుకోవ‌ద్ద‌ని చెప్పిన ఏకైక వ్య‌క్తి అత‌డేన‌ని కార్తీక్ చెప్పాడు. ‘నాతో ఇంటర్వ్యూ తీసుకున్నావు. నన్ను వెన్నుపోటు పొడిచాడు. రిష‌బ్ పంత్ ను హైలెట్ చేశాడు. కాబ‌ట్టి నాతో కామెడీలు చేయొద్దు ప్లీజ్.’ అంటూ కార్తీక్ న‌వ్వుతూ అన్నాడు.

దాదాపు 10 మ్యాచుల త‌రువాత కాల్ చేసి చాలా బాగా ఆడావు అని మెచ్చుకున్నాడు. అప్ప‌టి నుంచి మా మ‌ధ్య మంచి సంబంధం మొద‌లైంద‌ని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. గురువారం వాంఖడే వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌కుంటే ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు సంక్లిష్టం అవుతాయి.

Rohit Sharma : డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ శ‌ర్మ స్పీచ్‌.. హార్దిక్‌కు కావాల్సింది అదే..